ఛార్మీ.. కెరీర్ ప్రారంభించి దశాబ్ధం పైగానే అయ్యింది. ఏనాడైనా ఊరివాళ్లు ఎదురొచ్చి హారతి ఇచ్చారా? కానీ ఈ కుర్రాడు నటించిందే ఒక్కగానొక్క సినిమా.. వేద పండితులు ఎదురొచ్చి హారతి ఇచ్చారు. అంతేనా స్నేహితుల బృందం 200 నుంచి 300 బైక్స్ పై, 50 కార్లతో ర్యాలీగా వచ్చారు. అమలాపురంలో రెండు కిలోమీటర్ల పాటు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తూ.గో, ప.గో, రాజమండ్రి, అమలాపురంలో దిగ్విజయంగా సక్సెస్ యాత్ర నడిపించాడీ హీరో. రాజమండ్రి లో అయితే ఏకంగా స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఓ కాలేజీ లో వేలాది మంది విద్యార్థుల మధ్య సన్మానం చేశారు. ఇదంతా ఎవరిగురించి అనుకునేరు? ఆ కుర్రాడు 'మంత్ర 2' హీరో చేతన్.
మంత్ర 2లో ఛార్మి ప్రధాన నాయిక. కానీ ఏం లాభం? ఇంతవరకూ మీడియాకి కనిపించిందే లేదు. సక్సెస్ అంటూ ప్రచారం చేసిందే లేదు. దర్శకనిర్మాతలకు కోపరేట్ చేసిందే నయ్. కాని హీరో మాత్రం బాగా నటించావ్ అంటూ మెప్పు పొందాడు. అంతేనా మంత్ర 2 నిర్మాతలు ప్రచారకార్యక్రమాలు చేయలేకపోయినా హీరోగా అన్నిటినీ తన బాధ్యతగా భావించి ఇలా సక్సెస్ టూర్ నిర్వహించాడు. సొంతంగా ఖర్చు చేసి నిర్మాతకు మేలు చేసేందుకు ప్రయత్నించాడు. ఇతగాడి ఉత్సాహం చూస్తుంటే మునుముందు పెద్ద హీరోనే అయ్యేట్టు ఉన్నాడు. ప్రస్తుతం రాజుగారి గది చిత్రంలో నటిస్తున్నానని చెప్పాడు. ఛార్మీ చూసి నేర్చుకో.