ఆరోపణలపై చిన్మయి ఏమందంటే..

Update: 2017-03-04 12:07 GMT
కొద్ది రోజులు సింగర్ సుచిత్రా కార్తీక్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ధనుష్.. త్రిష.. అనిరుధ్.. ఆండ్రియా.. చిన్మయిల ప్రైవేటు ఫోటోలను లీక్ చేయడం.. ఆ తర్వాత అబ్బే తూచ్.. అకౌంట్ హ్యాక్ అయిందనడం జరిగాయి. రెండోసారి మళ్లీ వాటినే పోస్ట్ చేసి.. ఇంకా కమింగ్ సూన్ అంటూ చెప్పి డేట్స్ కూడా ఇచ్చాక.. మళ్లీ అకౌంట్ హ్యాక్ అయిందంటూ కామెడీ చేస్తోంది.

తనపై చేసిన ఆరోపణలపై ఇప్పుడు చిన్మయి స్పందించింది. 'నేను.. రాహుల్ ఇద్దరం సుచిత్ర భర్త కార్తీక్ తో మాట్లాడం. తను ఏదో ఎమోషనల్ గా బాధ పడుతోందని చెప్పాడు. ఇలాంటి పరిస్థితి అందరికీ ఎదురుకావచ్చు. అందుకే మేం ఆ విషయాన్ని పట్టించుకోకూడదని భావించాం. కానీ రెండోసారి కూడా ఇదే జరగడం.. నిజంగా దారుణం. నేను ఇలాంటి వాటికి భయపడే రకం కాదు. నేను మంచి వ్యక్తిగా ఉన్నాను.. ఉంటాను' అని వివరణ ఇచ్చింది సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.

చిన్మయి భర్త.. యాక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా ఈ అంశంపై స్పందించాడు. 'నేను తనను ఎంతో ఇష్టపడతాను. తను ఓ అద్భుతమైన వ్యక్తి. మిగిలిన వారి కంటే తను నాకు ఎక్కువగా తెలుసు. ఆమెలా అద్భుతంగా ఇతరులు కూడా ఉంటే.. వారు కూడా సంతోషంగా ఉంటారు' అన్నాడు రాహుల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News