ఆ కుక్క పిల్లపై ప్రేమ చూపిస్తున్న సింగర్

Update: 2016-07-08 04:40 GMT
గతంలో సినిమా వాళ్లంటే మెటీరియలిస్టులు అనే ఫీలింగ్ చాలామందికి ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా.. ఇలాంటి భావాల్లో మార్పులు వస్తున్నాయి. వారిలో సున్నితమైన మనసున్న వారు ఎంతమంది ఉంటున్నారో జనాలకు బాగానే తెలుస్తోంది. ఇప్పుడు సింగర్ చిన్మయి శ్రీపాద తీసుకున్న ఓ నిర్ణయం.. చాలామందికి స్ఫూర్తిని కలిగిస్తోంది.

భద్ర అనే కుక్క పిల్ల ఒకటి రీసెంట్ గా వార్తల్లో నానుతోంది. నెలల వయసు మాత్రమే ఉన్న ఈ చిన్నారి డాగీని.. ఓ బిల్డింగ్ ని విసిరేశాడు ఫైనలియర్ చదువుతున్న మెడికో. అతడి చర్యపై విపరీతంగా విమర్శలు చుట్టుముట్టాయి. ఆన్ లైన్ లో కూడా ఈ వీడియో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఈ కుక్కపిల్ల కాలికి గాయంతో బతికి బయటపడగా..శ్రవణ్ కృష్ణ అనే వ్యక్తి ప్రస్తుతం పెంచుకుంటున్నాడు. ఇకపోతే ఈ చిన్నారి డాగ్ ను దత్తత తీసుకునేందుకు సింగర్ చిన్మయి ముందుకొచ్చింది.

భద్రాను దత్తత తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా చెప్పిన చిన్మయి.. ప్రస్తుతం తాము ఓ కుక్కను పెంచుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పుడు భద్రాను ఇంటికి తీసుకెళ్లడం ద్వారా.. తమ పెంపుడు కుక్కకు ఇది తోడు ఉంటుందని చెప్పింది చిన్మయి. మొత్తానికి ఈ చిన్నారి కుక్క బతికడమే ఆశ్చర్యం అయితే.. అది భద్ర.. భద్రంగా చిన్మయి దగ్గరకు చేరనందన్న మాట.
Tags:    

Similar News