ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ సడెన్ గా తీసుకున్న డెసిషన్ దేశవ్యాప్తంగా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమందిని అష్టకష్టాలు పెడుతోంది. రోజు వారి కూలీలు సైతం పనులు మానుకుని..పస్తులుంటూ తమ వద్ద ఉన్న ఒకటి రెండు పాత పెద్ద నోట్లను మార్చుకుంటున్నారు. ఈ బాధలు సామాన్యులనే కాదు సెలబ్రిటీలను సైతం వెంటాడుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు సింగర్ చిన్మయికి కూడా ఓ షాకింగ్ ఎక్స్ పీరియన్స్ ఎదురైంది. గురువారం చిన్మయి ఆమె భర్త రాహుల్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. వచ్చీ రావడంతోనే వారికి పెద్ద నోట్ల కష్టాలు స్టార్ట్ అయ్యాయి. మోడీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించినప్పుడు వారు అమెరికాలో ఉన్నారు. దీంతో వారి వద్ద అన్నీ పాత నోట్లే తప్ప...కొత్త నోట్లు లేవు.
ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే వారి వద్ద రద్దయిన పెద్ద నోట్లే కాని...వారి వద్ద ఇండియన్ కరెన్సీలో చెల్లుబాటు అయ్యే రూ.50 - రూ.100 నోట్లు అస్సలు లేవు. దీంతో వెంటనే చిన్మయి భర్త రాహుల్ వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లి కొత్త నోట్లను తీసుకునేందుకు ట్రై చేశాడు. అయితే ఏటీఎం సెక్యూరిటీ గార్డు రాహుల్ కు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
ఉదయం 10 గంటల వరకు ఏటీఎంలో డబ్బు లోడ్ చేయరని చెప్పడంతో రాహుల్ - చిన్మయి నిరాశపడ్డారట. అప్పుడు వారి వద్ద కనీసం టీ తాగేందుకు కూడా డబ్బులు లేవట. దీంతో సదరు సెక్యూరిటీ గార్డు వారు టీ తాగేందుకు తన వద్ద ఉన్న రూ.20 రాహుల్ కు ఇచ్చాడు. దీంతో వారు టీ తాగారు. ఈ విషయాన్ని చిన్మయి తన ఫేస్ బుక్ లో పేజ్ లో వెల్లడిస్తూ మంచి మనస్సు ఉన్న మనుష్యులు మనలో చాలా మంది ఉన్నారని ఫుల్ ఖుషీ ఫీల్ అయ్యింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/