చిరు150: సెటిల్మెంట్‌ అయిపోయిందంటా

Update: 2016-05-27 14:12 GMT
అప్పుడెప్పుడో 2010లో హీరో విజయ్‌ కు కథ చెప్పేస్తే.. దానిని సినిమా కూడా తీద్దాం అని మొదలెడితే.. అది అర్ధంతరంగా ఆగిపోయింది. అయితే 2014లో సేమ్‌ ఇదే (ఇలాంటి కథతో) కథతో మురుగదాస్‌ ''కత్తి'' సినిమాను తీశాడు. దీనిపై విజయ్‌ కు ఫిర్యాదు చేసినా.. నిర్మాతలను నిలదీసినా.. మురగదాస్‌ పై కంప్లయింట్‌ ఇచ్చినా పెద్దగా స్పందనేం లేదు. కాని ఎప్పుడైతే మెగాస్టార్‌ చిరంజీవి ఈ కథను తెలుగులో తీయాలని ఫిక్సయ్యారో.. అప్పుడే రైటర్‌ నరసింహారావు కళ్లలో ఆనందం చిగురించింది. పదండి చూద్దాం.

ఇప్పటికే రైటర్‌ నరసింహారావు ఈ కథ నాదే అంటూ.. తనకు పరిహారం మాత్రమే కాకుండా.. సినిమాలో క్రెడిట్‌ కూడా వేయాలంటూ.. మన తెలుగు రైటర్స్ అసోసియేషన్‌ లో కంప్లయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొన్న చిరంజీవి 150వ సినిమాకు ముహూర్తం పడగానే.. మనోడు వెంటనే మీడియాకు ఏమని సెలవిచ్చాడంటే.. వినాయక్‌ తన విషయం సెటిల్‌ చేస్తానన్నాడని.. చేయకపోతే మాత్రం రచ్చ చేస్తానని చెప్పేశాడు. ఎట్టకేలకు ఈ యవ్వారం సెటిల్‌ అయ్యిందంట. అది కూడా.. తమిళ నిర్మాతల నుండే నరసింహారావుకు నష్టపరిహారం ఇప్పించేశారట. సెటిల్మెంట్‌ చేసేశారట. ఇష్యూ ఇక్కడితో ఖేల్ కతమ్‌ దుఖాన్‌ బంద్ అంటున్నారు ఫిలిం నగర్‌ పెద్దలు.

ఏదో చిరంజీవి ఈ సినిమాను రీమేక్‌ చేద్దాం అనుకున్నారు కాబట్టి.. నరసింహారావుకు డబ్బులైనా వచ్చాయి.. అదే కనుక విజయ్‌ సినిమానే అప్పట్లో డైరెక్టుగా రిలీజ్‌ చేసేసి ఉంటే.. అసలు ఈయన్ను ఎవరన్నా పట్టించుకునేవారా? అప్పుడు మహేష్‌ అండ్ మురగదాస్‌ కాంబినేషన్లో వచ్చే సినిమా రిలీజ్‌ ఆపాలని ఈయన ప్రయత్నించుండేవాడేమో!!
Tags:    

Similar News