చిరంజీవి తాత‌య్య‌ని మ‌న‌వ‌లు భ‌య్యా అంటారా!

Update: 2022-11-06 00:30 GMT
మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఓ లెజెండ్. దేశ వ్యాప్తంగా చిరంజీవిని ఎంతో మంది అభిమానిస్తారు. ఆయ‌న పేరిట పాన్ ఇండియా వైడ్ ఎన్నో అభిమాన సంఘాలున్నాయి. చిరు పుట్టిన రోజును ప్ర‌తీ ఏడాది ఎ ంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు. ఇక తెలుగు రాష్ర్టాల్లో మెగా అభిమానులు చేసే ర‌చ్చ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

ర‌క్త‌దాన శిబిరాలు..అన్న‌ధాన కార్య‌క్ర‌మాలు..సేవా కార్య‌క్ర‌మాలు అంటూ చిరు పేరిట ఎన్నో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు.  న‌టుడిగా 150కి పైగా సినిమాలు చేసిన చరిత్ర  ఆయ‌న సొంతం. నేటి జ‌న‌రేష‌న్ హీరోల‌తోనూ పోటీ ప‌డుతూ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతున్నారు. అంత‌టి లెజెండ్ కి సొంత ఇంట్లో ఎలాంటి ప‌రిస్థితి త‌లెత్తిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నివ్వెర పోవాల్సిందే.

మ‌రి ఇంత‌కి మెగాస్టార్ కి వ‌చ్చిన ఆ అతిపెద్ద క‌ష్టం ఏంటంటే? అది మ‌న‌వ‌రాళ్ల రూపంలో త‌రుచూ ఎదుర‌వుతుంద‌ని తెలుస్తోంది. అవును. ఆయ‌న మ‌న‌వ‌ల‌కు త‌న సినిమాలు వేసి చూపిస్తే త‌ప్ప త‌న‌ని న‌టుడిగా ఒప్పుకోవ‌డం లేదుట‌. జ‌న‌రేష‌న్ ఛేంజ్ అవ్వ‌డం తో త‌న‌కి అలాంటి ప‌రిస్థితి వ‌చ్చింద‌ని చిరు ఓ ఈవెంట్ లో న‌వ్వేసారు.

రామ్ చ‌ర‌ణ్‌..బ‌న్నీ...వ‌రుణ్ ...సాయితేజ్ వీళ్ల సినిమాలు త‌ప్ప త‌న‌ సినిమాల గురించి  ఎప్పుడూ మాట్లాడ‌ర‌ని..టీవీ పెట్టాల్సి వ‌స్తే నాటు నాటు అంటూ మ‌న‌వ‌లు గొల చేస్తార‌ని...వాళ్లు పుట్ట‌క ముందే  తాను న‌టుడ్ని అని ఇంట్లో ఎవ‌రూ లేన‌ప్పుడు చెప్పుకుంటున్నాని స‌ర‌దాగా న‌వ్వేసారు. అలాగే ఇంట్లో  చిరంజీవి మ‌న‌వ‌లు  తాత‌య్య అని పిల‌వ‌రు అటా..భ‌య్యా అని  ముద్దుగా పిలుస్తార‌ని చెప్పుకొచ్చారు.

వాళ్లు ఎలా పిలిచినా త‌నకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. తాత‌య్య అంటే నేను కూడా వ‌య‌సైపోయింద‌ని పీలేవాడినేమో. ల‌క్కీ గా అలా పిల‌వ‌లేదు. సంతోషం' అంటూ న‌వ్వేసారు. ఇటీవ‌లి కాలంలో చిరంజీవి వ్య‌క్తిగ‌త విష‌యాల్ని సైతం చాలా స‌ర‌దాగా మీడియాతో పంచుకుంటున్నారు.

కుటుంబం లో జ‌రిగే స‌ర‌దా సంభాష‌ణ‌ల్ని  అభిమానుల‌కు షేర్ చేస్తున్నారు. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. చిరులో ఇంత‌కుమునుపెన్న‌డు చూడ‌ని మార్పు క‌నిపిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News