మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసింది యూనిట్. కాగా.. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ మధ్య వచ్చే ప్రత్యేక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.
ఈ షూట్ కోసం తూర్పుగోదావరి జిల్లా, మారేడు మిల్లి అడవుల్లోకి వెళ్లింది యూనిట్. ఫిబ్రవరి 21 నుంచి అక్కడి అటవీ ప్రాంతాల్లో ఈ షూటింగ్ మొదలు కానుంది. అయితే.. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆదివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం మధురపూడి (రాజమండ్రి) ఎయిర్‌పోర్టులో దిగారు మెగాస్టార్. అయితే.. చిరంజీవి రాకను ముందే తెలుసుకున్న అభిమానులు.. తమ హీరోకు ఘనస్వాగతం పలికారు.
దీంతో చిరంజీవి కారు డోరు వద్ద నుంచి నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. ఫ్యాన్స్ ఆనందం పట్టలేక చిరుపై పూల వర్షం కురిపించారు. ‘ఆచార్య.. ఆచార్య..’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాజమండ్రి నగరం మొత్తం ‘ఆచార్య’ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయింది. కాగా.. రామ్ చరణ్ నాలుగు రోజులుగా మారేడుమిల్లిలోనే ఉన్నారు.
ఈ షూటింగ్ మార్చి మొదటి వారం వరకు కొనసాగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో మొత్తం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు సమాచారం. కాగా.. ఈ ప్రాంతంలోనే ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప’ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. మే 13న ఈ సినిమా థియేటర్లను తాకబోతోంది.