మేమిద్దరం టామ్ అండ్ జెర్రీల టైపు అని చెప్పుకొంటుంటారు చిరంజీవి - మోహన్ బాబు. నిజంగానే ఆ ఇద్దరి మధ్య తరచుగా అలాంటి వార్‌లు జరుగుతుంటాయి. ఒకరి గురించి ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇదివరకు ఒకసారి సీరియస్ గొడవ కూడా జరిగింది. అయితే మళ్లీ ఈమధ్య ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు సరదాగా ఒకరిపై మరొకరు చెణుకులు విసురుకుంటున్నారు. తాజాగా ఆ ఇద్దరూ మరోసారి టామ్ అండ్ జెర్రీలం అనే విషయాన్ని గుర్తు చేశారు.
అందుకు శత్రుఘ్నసిన్హా జీవిత చరిత్రకి సంబంధించిన పుస్తక విడుదల కార్యక్రమం వేదికైంది. మొదట చిరంజీవి మాట్లాడుతూ... నాకూ, శత్రుఘ్న సిన్హ జీవితానికీ మధ్య చాలా పోలికలున్నాయి. ఒకరకంగా నేనూ తనలాంటి వాడినే అని చెప్పుకొచ్చాడు. ఇంతలో మోహన్ బాబు అడ్డు తగిలాడు. శత్రుఘ్న సిన్హా జీవితానికి, నా జీవితానికీ మధ్య పోలికలుంటే ఉండొచ్చు కానీ... తనలా నువ్వెలా అవుతావు అని వ్యాఖ్యానించాడు. చిరంజీవి అందుకు స్పందిస్తూ నా సినీ ప్రయాణం, శత్రు సినీ ప్రయాణం ప్రతినాయక పాత్రలతోనే మొదలైందన్నాడు. మళ్లీ మోహన్ బాబు మాట్లాడుతూ ``నా జీవితం కూడా ప్రతినాయక పాత్రలతోనే మొదలైంది. కానీ... ఇక్కడ ఎవరి శైలి వాళ్లకుంది`` అంటూ ఆ మాటలకి అక్కడితో పుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే ఆ మాటలు మాత్రం వేదికపైన ఉన్న అతిథులకి మాత్రం ఆసక్తికరంగా అనిపించాయి. చిరంజీవి - మోహన్ బాబు శత్రుఘ్నసిన్హాతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. ఈ వేడుకలో మరోసారి తన ప్రాణ స్నేహితులైన రజనీకాంత్ - అంబరీష్ లని గుర్తు చేసుకొన్నాడు మోహన్ బాబు.