రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా అరంగేట్రంలోనే అదిరిపోయే హిట్ కొట్టాడు. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150తో ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ సాధించేయడమే కాదు.. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి సింగిల్ లాంగ్వేజ్ మూవీని ఆవిష్కరించాడు. కొణిదెల ప్రొడక్షన్స్ అంటూ ఎంట్రీలోనే తిరుగులేని విజయం సాధించాడు చెర్రీ. ఇప్పుడు చెర్రీ తన నిర్మాణంలో రెండో సినిమా కూడా మొదలుపెట్టేస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ నిర్మించే రెండో సినిమా కూడా మెగాస్టార్ తోనే అనే విషయం తెలిసిందే అయినా.. ఇప్పుడది అధికారికం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సబ్జెక్టును సినిమాగా తీయబోతున్న విషయం ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు తగిన లొకేషన్స్ ను అన్వేషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. స్వతంత్ర సమరయోధుడి పాత్రలో మెగాస్టార్ కనిపించనున్నారు. అయితే.. అందరూ అనుకుంటున్నట్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ సినిమా టైటిల్ కాదు.
ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదని నిర్మాణ సంస్థ చెబుతోంది. పరుచూరి బ్రదర్స్ తో పాటు పలువురు సీనయర్లు.. ట్యాలెంటెడ్ రైటర్లతో వర్క్ చేసిన సురేందర్ రెడ్డి.. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేసేసుకున్నాడు. మెగా 151 ప్రొడ్యూసర్ రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ పల్లెటూరి ప్రేమకథలో నటిస్తుండడం విశేషం. ఇది కూడా పీరియాడిక్ మూవీనే అంటున్నారు.