మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో.. టాలీవుడ్ లో తన స్టామినా.. స్థాయి నిరూపించుకున్నారు. ఈ వీకెండ్ నాటికి ఖైదీ 100 కోట్ల మార్క్ ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు మెగాస్టార్ తన 151వ మూవీపై దృష్టి పెట్టేశారు. ఇప్పటికే మరింత సన్నగా మారేందుకు వర్కవుట్స్ కూడా చేసేస్తున్నారు.
చిరు చిరకాల కోరిక అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సబ్జెక్టును 151వ చిత్రంగా మలించేందుకు మెగా టీం దాదాపు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అయితే.. ముందుగా అనుకున్నట్లు బోయపాటి శ్రీను కాకుండా.. సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. 170 ఏళ్ల క్రితం జరిగిన కథను.. ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కథను మలించేందుకు.. ఈ స్టైలిష్ డైరెక్టర్ కరెక్ట్ ఆప్షనా కాదా అన్నదే చాలామందికి వస్తున్న డౌట్. రాజమౌళి.. క్రిష్ లాంటి దర్శకులైతే.. ఇప్పటికే ఈ విషయంలో ప్రూవ్ చేసేసుకున్నారు.
దేశభక్తిని రగిలించేలా మూవీ తీయడం.. ఈ జోనర్ పై ఇప్పటివరకూ సురేందర్ రెడ్డికి పట్టు లేదు. అలాగని డీల్ చేయలేడని అనడం కూడా కరెక్ట్ కాదని చెప్పాలి. యాక్షన్ జోనర్ అదరగొట్టిన శ్రీను వైట్ల గతంలో కామెడీ మూవీస్ చేసినా.. తర్వాత కమర్షియల్ ఎంటర్టెయినర్స్ ఇరగదీశాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా ఈ కొత్త జోనర్ లో తన సత్తా చాటే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.
మరోవైపు ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ సబ్జెక్టును దాదాపు ఫైనల్ చేసేశారు. దేశభక్తి రగిలించే డైలాగులు రాయడంలో.. ఈ సీనియర్ రైటర్స్ చెయ్యి తిరిగిన వాళ్లు కావడం.. చిరుతో ఎంతో కాలం నుంచి సాన్నిహిత్యం ఉండడంతో.. ఉయ్యాలవాడ సబ్జెక్టుపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోందనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/