మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో మెగా మద్ధతు ఉన్న ప్రకాష్ రాజ్ ఓటమి ఆ కాంపౌండ్ కి జీర్ణించుకోలేనిదిగా అంతా భావిస్తున్నారు. ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు 100 పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి అధ్యక్షుడయ్యారు.
తాజాగా `మా` ఎలక్షన్ నుంచి చిరంజీవి నన్ను విత్ డ్రా చేసుకోమన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోటీ నుంచి వైదొలగమన్నారు. చెప్పకూడదనుకున్నా.. ఎన్నికలు అయ్యాయి గనుక చెబుతున్నా అంటూ మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని వాటిని పట్టించుకోకూడదని కూడా అన్నారు. ఆసక్తికరంగా `మా` ఎన్నికల ప్రచారంలో చిరంజీవి అంకుల్ నాకే ఓటేస్తానన్నారని కూడా మంచు విష్ణు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
`మా` ఎన్నికలు తొలి నుంచి మెగా వర్సెస్ మంచు వార్ గానే నడిచింది. దీనిపై మీడియాలో పెద్ద డిబేట్లు నడిచాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా మంచు కాంపౌండ్ గట్టి పట్టు బట్టి పని చేసిన సంగతి విధితమే. చివరికి విష్ణు గెలిచిన ఉత్సాహంలో ఉన్నారు. ఇన్నాళ్లు సినీపెద్దగా గౌరవం అందుకున్న మెగాస్టార్ పై యువనటుడు సూటిగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.