సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డ సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయనను అపోలో ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రి నుండి వచ్చిన నివేదికలు అతను ప్రమాదం నుండి బయటపడ్డారని.. కాలర్ ఎముక ఫ్రాక్చర్‌తో పాటు కొన్ని మృదు కణజాల గాయాలను తగిలాయని వెల్లడించింది.
ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ , పవన్ కళ్యాణ్ లు అపోలో ఆసుపత్రిని సందర్శించారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆరాతీశారు. అనంతరం చిరంజీవి ట్వీట్ చేశారు, అభిమానులు .. శ్రేయోభిలాషులందరూ ఆందోళన చెందవద్దని.. ఆందోళనకు గురికావద్దని తెలిపారు.

సాయిధరమ్ కొన్ని గంటల క్రితం ప్రమాదానికి గురైనా పెద్దగా గాయాలు ఏమీ లేవని.. స్వల్ప గాయాలు అయ్యాయని చిరంజీవి వివరించారు. అభిమానులు ఆందోళన చెంది ఆస్పత్రికి రావద్దని విజ్ఞప్తి చేశారు. సాయిధరమ్ తేజ్ సేఫ్ అని అభిమానులు & శ్రేయోభిలాషులతో పంచుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. సాయిధరమ్ ప్రస్తుతం నిపుణులైన వైద్య పర్యవేక్షణలో కోలుకుంటున్నాడని చిరంజీవి తెలిపారు.కొన్ని రోజుల్లో తిరిగి వస్తాడు.