మెగాస్టార్ చిరంజీవి.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇద్దరూ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. చిరంజీవి నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి వచ్చాడు బ్రహ్మానందం. ఈ కార్యక్రమంలో భాగంగా.. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన జంధ్యాలను గుర్తు చేసుకున్నాడు బ్రహ్మీ. చిరు కూడా ఆయనతో కలిసి పని చేసి ఉండడంతో.. వీరిద్దరి మధ్య కాసేపు జంధ్యాల గురించిన డిస్కషన్ జరిగింది.
ఓ స్టేజ్ మీద బ్రహ్మీని కలిసిన జంధ్యాల.. తాను తాగేసి ఉన్నట్లుగా కనిపిస్తున్నానా అని అడిగినట్లుగా బ్రహ్మానందం చెప్పాడు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. 'నా భర్తకు ఆల్కహాల్ అలవాటు ఏ మాత్రం లేదు. అందుకే ఆయనకు ఫోన్ చేసి.. ఇలాంటి అబద్ధాల గురించి మాట్లాడ్డం సరికాదని సూచించాను' అన్నారు జంధ్యాల భార్య అన్నపూర్ణ. 'నేను ఆ కార్యక్రమం చూడలేదు. కానీ మా అమ్మాయి చూసింది. టీవీ ఛానల్ వాళ్లు ఆ క్లిప్పింగ్ పంపారు. నా భర్తపై బ్రహ్మానందం చేసిన కామెంట్స్ కు అభ్యంతరాలు తెలిపాను. క్షమించమని అడిగి.. ఆ క్లిప్పింగ్ వరకూ కార్యక్రమంలోంచి తీసేశారు' అని చెప్పారు అన్నపూర్ణ.
అలాగే అంత మంది పబ్లిక్ చూసే కార్యక్రమంలో.. ఇలాంటి అంశాలను ఎంకరేజ్ చేయకుండా ఉండాలని చిరంజీవికి సూచించారు జంధ్యాల భార్య. 'చిరంజీవి.. బ్రహ్మానందం.. ఇద్దరూ బాగా చదువుకున్న వారే కాదు మంచి వారు కూడా. కానీ ఈ లోకంలో లేని ఒక మనిషి గురించి ఇలా మాట్లాడ్డం సరికాదు' అన్నారు అన్నపూర్ణ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/