మెగా ఎంట్రీపై హైప్ తగ్గిందా? పెరిగిందా?

Update: 2015-10-18 11:30 GMT

Full View
మెగా స్టార్ రీ ఎంట్రీ ఎలా ఉంటుంది ? 150వ సినిమాలో చిరు స్పెషల్స్ ఏంటి ? ఎలా కనిపిస్తారు ? అప్పటి ఈజ్ - గ్రేస్ ఉంటాయా ? రెండ్రోజుల క్రితం వరకూ ఇవన్నీ ప్రశ్నలే. ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది. మెగాస్టార్ లో మెగా పవర్ ఏ మాత్రం తగ్గలేదని తెలిసిపోయింది. బ్రూస్ లీలో చిరు స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను కేకలు పెట్టించింది. ఐదు నిమిషాలపాటు ఆడియన్స్ ని అరుపులు పెట్టించేశారు మెగాస్టార్. అంతాబాగానే ఉంది కానీ.. చిరు రీఎంట్రీ పై ఉన్న ఉత్కంఠ తొలగిపోయినట్లయింది.

ఇది 150వ సినిమాకి టీజర్ అని చెర్రీ చెబ్తున్నాడు కానీ.. స్ట్రయిట్ గా మాట్లాడుకోవాలంటే బ్రూస్ లీ యే చిరంజీవికి 150వ సినిమా. ఇంతకంటే తక్కువ సేపు కనిపించిన లారెన్స్ స్టైల్ - జయసుధ హ్యాండ్సప్ - రామ్ చరణ్ మగధీరలు.. చిరు మూవీస్ గా లిస్ట్ లో ఉన్నపుడు.. ఇది కూడా లెక్కవేయాల్సిందే. ఎమోషనల్ గా కనెక్ట్ చేసేందుక ఇది టీజర్ అంటున్నారు. అయితే.. బ్రూస్ లీని కాపాడేందుకు చేశారో.. లేక జనాల రియాక్షన్ ఎదురుచూసేందుకు చేశారో ఖచ్చితంగా చెప్పలేం కానీ.. బ్రూస్ లీ కారణంగా చిరంజీవి రీఎంట్రీపై ఉన్న సస్పెన్స్ తొలగిపోయింది.

మరిప్పుడు నెక్ట్స్ చిరంజీవి చేయబోయే చిత్రానికి ఇంత హైప్ ఉంటుందా అంటే.. దొరికే ఆన్సర్ భలేగా ఉంటుంది. ఏ స్టార్ హీరో చిత్రానికైనా రిలీజ్ ముందు ఎక్స్ పెక్టేషన్స్ విపరీతంగానే ఉంటాయి. అందుకు చిరంజీవి మినహాయింపు కాదు. ఇప్పుడు బ్రూస్ లీ కేమియో తో ఇంట్రడక్షన్ ఇచ్చినా.. తర్వాత చిత్రానికి అంచనాలు ఉండవు అనుకోవడం కరెక్ట్ కాదు. జస్ట్ ఆయన రీఎంట్రీని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయం స్పష్టమైంది అంతే.

ఐదు నిమిషాల కోసం కాబట్టి డైరెక్టర్ శ్రీనువైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అత్యంత జాగ్రత్తలు తీసుకుని డీల్ చేసేశారు. మరి రెండున్నర గంటలపాటు ఇదే ఎమోషన్స్ ని క్యారీ చేయడం మామూలు విషయం కాదు. సో.. బ్రూస్ లీలో కనిపించి చిరు హైప్ తగ్గించారు కానీ.. తనను డైరెక్ట్ చేసే దర్శకుడిపై బాధ్యతలు పెంచేశారు.
Tags:    

Similar News