సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భం ఏంటో తాజాగా వెల్లడించారు. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' కోసం అక్కినేని సమంత నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'సామ్ జామ్' లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కు పెట్టారు. ఇందులో చిరంజీవి తన కెరీర్, వ్యక్తిగత జీవితం, రాజకీయాలు.. మొదలైన అంశాలతో పాటు పలు ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు. చిరు మాట్లాడుతూ తాను జయాపజయాలను పెద్దగా పట్టించుకునేవాడిని కాదని.. అయితే ఓ సినిమా ఫ్లాప్ అయినందుకు మాత్రం వెక్కి వెక్కి ఏడ్చానని చెప్పుకొచ్చారు.
చిరంజీవి మాట్లాడుతూ.. 'నా కెరీర్ ను మలుపు తిప్పిన 'ఖైదీ' సినిమా 1983లో రిలీజై సూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో నాకు ఎంతో క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత అదే కాంబినేషన్లో 'వేట' సినిమా చేశాం. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ సినిమా ప్లాప్ అయింది. ఆ సినిమా ఖైదీని మించి హిట్ అవుతుందని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ ఊహించని విధంగా ఫ్లాప్ కావడం నన్ను కలిచివేసింది. ఆ బాధను తట్టుకోలేక ఇంట్లో దుప్పటి కప్పుకుని వెక్కివెక్కి ఏడ్చాను. దాని నుంచి బయటపడటానికి నాకు కొన్ని రోజులు పట్టింది'' అని చెప్పుకొచ్చారు. అలానే ఈ ఇంటర్వ్యూలో 'శంకరాభరణం' సినిమా క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని కూడా చిరు తెలిపారు.