పవన్.. నాగబాబు మధ్య తేడా చెప్పిన చిరు

Update: 2017-01-11 05:17 GMT
మెగాస్టార్ చిరంజీవికి తన తమ్ముళ్లంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అనేక సందర్భాల్లో తన తమ్ముళ్లపై ప్రేమను చాటుకున్నాడు చిరు. తమ్ముళ్లు కూడా అన్నయ్య మీద ప్రేమను అదే స్థాయిలో చూపిస్తుంటారు. ఐతే నాగబాబుతో ఎప్పుడూ ఏ ఇబ్బందీ లేదు కానీ.. పవన్ తోనే గత కొన్నేళ్లలో చిరుకు తేడా కొట్టేసింది. రాజకీయ కారణాలతోనో.. వేరే విషయాల వల్లనో.. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. పవన్ రూటు మారింది. చిరు ఇంకో దారిలో నడుస్తున్నాడు. ఐతే నాగబాబు మాత్రం ఎప్పుడూ అన్నయ్యతోనే ఉన్నాడు. ఆయన బాటలోనే నడుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు తమ్ముళ్లలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం.. ఎవరితో ఎక్కువ కనెక్టవుతారు అనే ఆసక్తికర ప్రశ్న ఎదురైంది చిరుకు. ఆ ప్రశ్నకు చిరు ఏమని బదులిచ్చాడంటే..

‘‘నాకు ఇద్దరు తమ్ముళ్లూ చాలా ఇష్టం. ఏ ఒక్కరినో విడదీసి మాట్లాడలేను. ఐతే కమ్యూనికేషన్ పరంగా నాకు నాగబాబుతో ఎక్కువ అనుబంధం ఉంది. మేమిద్దరం కూర్చుని గంటలు గంటలు మాట్లాడుతుంటాం. నాగబాబుతో కూర్చుంటే నాకసలు టైమే తెలియదు. చాలా విషయాలపై మాట్లాడతాడు. రకరకాల కోట్స్ చెబుతాడు. క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి పెద్ద టాపిక్స్ గురించి చెబుతాడు. ఇంకా అనేక పుస్తకాల గురించి.. ప్రాపంచిక విషయాల గురించి నాతో చర్చిస్తాడు. నన్ను నవ్విస్తాడు. విజ్నానం పంచుతాడు. అలాగే తాను హోస్ట్ చేసే జబర్దస్త్ కార్యక్రమంలో రకరకాల సంగతుల గురించి నాతో చర్చిస్తాడు. పవన్ కళ్యాణ్ తో నాకు ఈ రకమైన కమ్యూనికేషన్ తక్కువ. కళ్యాణ్ ముందు నుంచి కూడా నాతో కూర్చుని మాట్లాడ్డం అరుదు. కానీ అతడితో నా అనుబంధానికి ఢోకా ఏమీ లేదు’’ అని చిరు చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News