డల్లాస్ లోను కులాల రచ్చ

Update: 2018-04-30 12:06 GMT
మా నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం కోసం డల్లాస్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి గతంలో ఎన్నడు లేని కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయని అక్కడి మీడియా టాక్. తనను వ్యక్తిగతంగా పిలిచిన ఎన్ఆర్ఐల ఈవెంట్స్ కు వెళ్తున్న చిరు అక్కడ వారంతా కులాల ప్రాతిపదికన విడిపోయి ఎవరి వేడుకకు ఆయా కులాల వారు మాత్రమే ఉండటం చిరు టీం గమనించి షాక్ అయ్యింది. పైగా ప్రత్యేక హోదా విషయం గురించి నిలదీసేలా కొన్ని ప్ల కార్డులు తయారు చేయించి కొందరు గుంపుగా గుమికూడి చేయటం వెనుక ఇలాంటి మాఫియానే ఉందనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు గతంలో లేని విధంగా దేశం కాని దేశంలో ప్రవాసభారతీయులు కులాల ప్రతిపాదికన విడిపోవడం చూసి చిరు అవాక్కయినట్టు సమాచారం.

అయినా ఈ మకిలి ఇప్పటిది కాదనే విషయం చిరుకి తెలియనిది కాదు. కాని కులమతాలకతీతంగా సినిమా హీరోలను ఇష్టపడే దేశంలో ఇలా అమెరికాలో విడిపోయి గ్రూపులుగా మారడం పట్ల చిరు నిజంగానే బాధ పడినట్టు సమాచారం. ఇక్కడ వన భోజనాల పేరుతో దాన్నో సంప్రదాయంగా మార్చి కులాల వారిగా అది కనక జరుపుకోకపోతే అదేదో తప్పు చేసినట్టు భావిస్తున్న ట్రెండ్ లో ఇప్పుడు ఈ జాడ్యం అక్కడికి కూడా పాకడం వింతేమి కాదు. ఎందుకుంటే అక్కడ ఇవన్ని చేస్తోంది కూడా ఇక్కడి లాంటి మనవాళ్ళేగా. ప్రభుత్వం ఒకపక్క ఓటు బ్యాంకు కోసం కులాల వారిగా కార్పోరేషన్లు బ్యాంకులు పెట్టి ప్రోత్సహిస్తుంటే మరోవైపు మీడియా సైతం కులాల వారిగా పెళ్ళిళ్ళు చేస్తూ బ్రోకర్ వ్యవస్థను తానే పెంచి పోషిస్తున్నప్పుడు మార్పు రావాలంటే జరిగే పనేనా. ఎక్కడికి వెళ్ళినా మనవాళ్ళు కొందరు ఎలా ఉంటారో తెలియజెప్పేలా ఇలాంటి సంఘటనలు జరగడం మాత్రం విచారకరం.
Tags:    

Similar News