ఇంత‌కీ యంగ్ డైరెక్ట‌ర్ తో చిరు సినిమా వున్నాట్టా లేన‌ట్టా?

Update: 2022-04-25 06:30 GMT
మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత `ఆచార్య‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. బాస్ నుంచి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానుల్లోనూ ఈమూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా చ‌ర‌ణ్ కు జోడీగా న‌టించింది.

ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి మ‌రో మూడు  చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్నారు. ఇప్ప‌టికే మ‌ల‌యాళ హిట్ చిత్రం `లూసీఫ‌ర్‌` ఆధారంగా `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాన్ని మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ లో చేస్తున్నారు. దీనితో పాటు మెహ‌ర్ ర‌మేష్ తో `వేదాలం` ఆధారంగా తెర‌కెక్కుతున్న `భోళా శంక‌ర్` చేస్తున్నారు. ఇవి చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే బాబి డైరెక్ష‌న్ లో `వాల్తేరు వీర‌య్య‌`ని కూడా ప‌ట్టాలెక్కించేశారు.

ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ ఈ మూడు చిత్రాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. ఇదిలా వుంటే వీటితో పాటు ఛ‌లో, భీష్మ వంటి హిట్ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వెంకీ కుడుముల డైరెక్ష‌న్ లో ఓ సినిమాకు మెగాస్టార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ మూవీని డీవీవీ దాన‌య్య నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. ఇంత వ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ ముహూర్తం జ‌రుపుకోలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మ‌ని, చిరుతో వెంకీ కుడుముల ప్రాజెక్ట్ లేన‌ట్టే అంటూ వార్త‌లు షికారు చేయ‌డం మొద‌లైంది.

ఇటీవ‌ల జ‌రిగిన `ఆచార్య‌` ప్రీ రిలీజ్ వేడుక కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌డంతో అంతా వెంకీ కుడుముల ప్రాజెక్ట్ అట‌కెక్కేసింద‌ని కామెంట్ లు చేస్తున్నారు. కార‌ణం `ఆచార్య‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరుతో సినిమాలు చేస్తున్న డైరెక్ట‌ర్లు క‌నిపించారు. కానీ వెంకీ కుడుముల మాత్రం అక్క‌డ క‌నిపించ‌లేదు. ఇలాంటి అవ‌కాశం అంటే ఏ ద‌ర్శ‌కుడైనా ఎగిరిగంతేసి ఫంక్ష‌న్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. కానీ వెంకీ కుడుముల మాత్రం క‌నిపించ‌క‌పోవ‌డంతో అనుమానాల‌కు బ‌లం చేకూరుతోంది.

అంతే కాకుండా `ఆచార్య‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత డీవీవీ దాన‌య్య స్టేజ్ పై క‌నిపించ‌డ‌మే కాకుండా మాట్లాడారు కూడా. కానీ చిరుతో వెంకీ కుడుముల డైరెక్ష‌న్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే దీన్ని ప్రారంభించ‌బోతున్నామ‌ని కానీ ఎక్క‌డా మాట్లాడ‌లేదు. దీంతో వెంకీ కుడుముల ప్రాజెక్ట్ చిరుతో లేద‌ని నిర్మాతే ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇందులో నిజ‌మెంత‌? .. అస‌లు చిరుతో యంగ్ డైరెక్ట‌ర్ ప్రాజెక్ట్ వున్నట్టా.. లేన‌ట్టా అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.
Tags:    

Similar News