సినీ ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్. ఒకసారి రిజల్ట్ పాజిటివ్ గా వస్తే చాలు.. వర్క్ పరంగా మళ్లీ మళ్లీ అవే సీన్స్ కనిపిస్తుంటాయ్. పేర్ల దగ్గర్నుంచి కాంబినేషన్స్ సెట్ చేసుకోవడం వరకు ఓల్డ్ మొమరీస్ గుర్తుకొచ్చేస్తుంటాయ్. మరి ముందే ప్లాన్ ప్రకారం చేస్తున్నారో.. అలా సెట్ అయిపోయాయే కానీ అబ్జర్వ్ చేస్తుంటే కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అయిపోతున్నట్టు కనిపిస్తున్నారు.
ఖైదీ నెంబర్ 150తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తీరాలనేది చిరంజీవి టార్గెట్. అందుకే రిచ్ మేకింగ్ తో పాటు.. సెంటిమెంట్స్ కూడా రిపీట్ అవుతున్నట్టున్నాయ్. ముందు కథ విషయానికే వస్తే ఫస్ట్ ఏఆర్ మురుగదాస్. పదేళ్ల క్రితం మురుగదాస్ రమణ మూవీనే చిరు ఠాగూర్ గా రీమేక్ చేసి బంపర్ హిట్ కొట్టారు. అప్పుడూ- ఇప్పుడూ డైరెక్టర్ వీవీవినాయకే. ఇక ఖైదీ అనే పేరుతో చిరంజీవికి అవినాభావ సంబంధం ఉంది. సినిమాలో ఖైదీ ఉంటే చిరుకి బ్లాక్ బస్టర్ పక్కా. అందుకే లాండ్ మార్క్ మూవీకి కూడా ఖైదీని రిపీట్ చేస్తున్నట్టున్నారంటున్నారు.
వీటితో పాటు డైరెక్టర్ గెస్ట్ అప్పీరియన్స్. ఠాగూర్ మూవీలో వీవీ వినాయక్ ఓ సన్నివేశంలో కనిపిస్తారు. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో కూడా వినాయక్ మళ్లీ మెరవబోతున్నారు. ఈ సీన్ కి చిరంజీవి డైరెక్షన్ చేయడం ఇంకో విశేషం. మెగాఫోన్ పట్టుకోని షాట్ ఓకే కట్ అంటూ చిరు డైరెక్షన్ చేసే సరికి వినాయక్ ఆనందం అంతా ఇంతా కాదు. వినాయక్ తో గెస్ట్ అప్పీరియన్స్ ఐడియా కూడా చిరుదే. కాకపోతే ఒరిజినల్ ''కత్తి''లో కూడా మురుగుదాస్ చేసిన పాత్రనే ఇప్పుడు వినాయక్ చేస్తున్నాడు. సింగిల్ షాటులో పంచ్ పేలిపోయే ఎప్పీయరెన్స్ అది. కాకపోతే చిరంజీవే డైరక్షన్ చేయడం ఇక్కడ హైలైట్. సో ఓవరాల్ గా చూస్తుంటే బ్లాక్ బస్టర్ కొట్టడానికి వీలున్న ఏ చిరు అవకాశాన్ని కూడా వదలకుండా మెగా సెంటిమెంట్స్ ఫాలో అయిపోతున్నట్టు కనిపించట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/