మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విజయం తేజు కెరీర్ కు ఎంతో కీలకం అనే సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను ఎలాగైనా హిట్ గా మలిచి తీరాలని 'చిత్రలహరి' టీమ్ పట్టుదలగా ఉన్నారట. అందుకే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి హెల్ప్ కూడా తీసుకుంటున్నారట.
ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి చిరంజీవి ఇప్పటికే పలు సూచనలు అందించారట. అయితే ఆ సూచనలలో ముఖ్యమైనది ఈ సినిమా క్లైమాక్స్ గురించేనని సమాచారం. ఈ సినిమాలో తేజు రెండు సార్లు లవ్ లో ఫెయిల్ అవుతాడని.. అందుకే రియలిస్టిక్ ఫీల్ వచ్చేలా నెగెటివ్ ఎండింగ్ ఇవ్వాలని దర్శకుడు అనుకున్నాడట. కానీ చిరు మాత్రం అలా చేయవద్దని దర్శకుడికి సూచించాడట. ఈ నెగెటివ్ ఎండింగ్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని.. పాజిటివ్ ఎండింగ్ ఉంటె రిపీట్ ఆడియన్స్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పారట. అందుకే చిరు సూచించిన విధంగానే సినిమా క్లైమాక్స్ ను హ్యాపీ ఎండింగ్ గా మార్చారట.
మావయ్య సజెస్ట్ చేసిన ఈ హ్యాపీ ఎండింగ్ తో అయినా తేజు ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్టపడుతుందేమో వేచి చూడాలి. కళ్యాణి ప్రియదర్శన్.. నివేద పేతురాజ్ లు ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.