మైఖేల్ జాక్సన్.. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా.. మెగాస్టార్ చిరంజీవి.. వీళ్ల డ్యాన్సులకు ఉండే ఫాలోయింగే వేరు. ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకున్నారు ఆ ముగ్గురూ. ముఖ్యంగా ఏజ్ అరవైని అధిగమించినా బాస్ లో గ్రేసు ఏమాత్రం తగ్గలేదని అతడి కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్ 150 క్లియర్ కట్ గా చెప్పింది. బాస్ లో ఉన్న గ్రేసు ఏమాత్రం తగ్గలేదని అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. ఆ బాడీలో స్ప్రింగులు తొడుక్కున్నారా? అన్నంతగా ఫ్లెక్సిబుల్ గా స్టెప్పులు వేయాలంటే మెగాస్టార్ తర్వాతనే.
64 వయసులోనూ ఆయన సత్తా ఏమాత్రం తగ్గలేదు అనేందుకు తాజాగా మరో వీడియో ప్రూఫ్ గా దొరికింది. మెగా బాస్ కెరీర్ లో చార్ట్ బస్టర్ గీతాల్లో టాప్ లో ఉండే గీతం బంగారు కోడిపెట్ట. ఎయిటీస్ రీయూనియన్ పార్టీలో ఆయన ఖుష్బూతో కలిసి ఈ పాటకు స్టెప్పులేశారు. వీక్షకులు ఆ స్టెప్పులకు ఔరా! అంటూ క్లాప్స్ కొట్టారంతే. ఖుష్బూ ఈ ఏజ్ లోనూ బాస్ తో సమానంగా గ్రేస్ చూపించడం ఆసక్తికరం.
మెగాస్టార్ కొత్త ఇంట్లో జరిగిన ఈ వేడుకలో 40 మంది టాప్ సౌత్ స్టార్స్ ఉన్నారు. ఇక వీళ్లతో పాటుగా జయప్రద- రాధిక- సుహాసిని లాంటి నాయికలు ఆ డ్యాన్స్ మూవ్స్ ని వీక్షిస్తూ బోలెడంత సందడి చేశారు. నాగార్జున- అమల జంట సహా పలువురు స్టార్లు ఈ వేదిక వద్ద ఆ మూవ్ మెంట్ ని ఆస్వాధించారు. ప్రస్తుతం ఈ స్టెప్పులకు సంబంధించిన వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది.
Full View