ఖైదీ నెంబ‌ర్ 150.. చేతులు మారిందా?

Update: 2016-11-29 03:40 GMT
సినిమాల నుంచి దాదాపు ద‌శాబ్ద కాలం విరామం తీసుకున్నా స‌రే.. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మీద ఇటు ప్రేక్ష‌కుల్లో.. అటు ట్రేడ్ వ‌ర్గాల్లో విప‌రీత‌మైన ఆస‌క్తి ఉంది. ఆయ‌న రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబ‌ర్ 150’ మీద అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జ‌రిగింది. అమెరికాలోనూ ‘ఖైదీ నెంబ‌ర్ 150’ డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ ఏకంగా రూ.13.5 కోట్లు ప‌లికాయి. క్లాసిక్ సినిమా సంస్థ చిరు150 హ‌క్కుల్ని సొంతం చేసుకుంది. ఐతే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సంస్థ ‘ఖైదీ నెంబ‌ర్ 150’ డిస్ట్రిబ్యూష‌న్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

క్లాసిక్ సినిమా నుంచి అదే రేటుకి మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ‘ఖైదీ నెంబ‌ర్ 150’ హ‌క్కుల్ని తీసుకున్న‌ట్లు తెలిసింది. గ‌తంలో డిస్ట్రిబ్యూష‌న్లోనే ఉండి.. ఆ త‌ర్వాత సినీ నిర్మాణంలోకి వ‌చ్చింది మైత్రీ మూవీ మేక‌ర్స్. శ్రీమంతుడు.. జ‌న‌తా గ్యారేజ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు అందించిన ఈ సంస్థ‌.. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో త‌న మూడో సినిమాను నిర్మించ‌నుంది. ఈ సంస్థ చేతికి ‘ఖైదీ నెంబ‌ర్ 150’ హ‌క్కులు రావ‌డంలో రామ్ చ‌ర‌ణ్ పాత్ర ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రి డిస్ట్రిబ్యూష‌న్ చేతులు మార‌డానికి కార‌ణాలేంటో కానీ.. ఓ పెద్ద సంస్థ చేతికి ‘ఖైదీ నెంబ‌ర్ 150’ రావ‌డంతో రిలీజ్ ప‌క్కాగా.. భారీగా ఉంటుంద‌ని మెగా అభిమానులు భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News