`ఆచార్య` కోసం జ‌క్క‌న్న త్యాగం వెన‌క‌

Update: 2020-06-08 09:15 GMT
మ‌హ‌మ్మారీ విల‌యం సినీ ప‌రిశ్ర‌మ‌ల్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది. అయినా ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులంతా ఎంతో హోప్ తో ఉన్నారు. మ‌హ‌మ్మారీని జ‌యించి తిరిగి య‌థాస్థితికి వ‌స్తామ‌న్న ధీమా క‌న‌బ‌డుతోంది. ఇప్ప‌టికే అమెరికాలో వ్యాక్సిన్ రెడీ చేశామ‌ని ట్రంప్ ప్ర‌క‌టించ‌డం.. ర‌క‌ర‌కాల చికిత్స‌లు అందుబాటులోకి రావ‌డంతో కొంత ఉప‌శ‌మ‌నం క‌నిపిస్తోంది. అయినా వైర‌స్ ప్ర‌భావం పెరుగుతుండ‌డం ఆందోళ‌న పెంచుతోంది.

అదంతా అటుంచితే లాక్ డౌన్ వ‌ల్ల ఇప్ప‌టికే టాలీవుడ్ లో షూటింగులు బంద్ అయిపోయాయి. దాదాపు మూడు నెల‌ల త‌ర్వాత తిరిగి షూటింగులు ప్రారంభించేందుకు తెలంగాణ‌- ఏపీ ప్ర‌భుత్వాలు అనుమ‌తులు మంజూరు చేశాయి. జూన్ 15 నుంచి ప‌రిమిత సిబ్బందితో చిత్రీక‌ర‌ణ‌లు చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వాలు వెసులుబాటు క‌ల్పించ‌డం తో ప‌రిశ్ర‌మ ఊపిరి పీల్చుకుంది. టీ ముఖ్య‌మంత్రి‌తో మంత‌నాలు సాగించ‌డంలో మెగాస్టార్ చిరంజీవి- రాజ‌మౌళి బృందం పెద్ద స‌క్సెసైంది. ఈనెల 9న ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గన్ తోనూ కీల‌క భేటీ సాగ‌నుంది. దీంతో ఆ క్రెడిట్ చిరు అండ్ టీమ్ కి ద‌క్కిన‌ట్ట‌య్యింది. ఇది కొంద‌రికి కంట‌గింపుగా ఉన్న సన్నివేశం ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డింది.

ఇక‌పోతే .. మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ వ‌ల్ల ఈపాటికే  కీల‌క షెడ్యూల్ పూర్తి కావాల్సిన ఆచార్య‌కు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇక పెండింగ్ 30శాతం పూర్తి చేయాల్సిన రాజ‌మౌళికి చిక్కులొచ్చి ప‌డ్డాయి. ఓవైపు చ‌ర‌ణ్ లాంటి స్టార్ ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ షూట్ పూర్తి చేసుకుని ఆచార్య షెడ్యూల్ లో జాయిన్ కావాల్సి ఉండ‌గా రెండిటికీ బ్రేక్ ప‌డిపోయింది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్ వేగంగా ముగించి ఆచార్య సెట్స్ లో జాయిన్ కావాల్సి ఉంది. ఇప్ప‌టికే చెర్రీని రిలీవ్ చేయాల్సిందిగా చిరు స్వ‌యంగా జ‌క్క‌న్న‌ను కోర‌డంతో దానిని కాద‌న‌లేని రాజ‌మౌళి తొలిగా చ‌ర‌ణ్ పై స‌న్నివేశాల్ని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌.

జూన్ 15 నుంచి తెలంగాణలో సినిమాల చ‌త్రీక‌ర‌ణ‌లు సాగ‌నున్నాయి. తొలిగా ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన ఇత‌ర‌ సన్నివేశాలను చిత్రీకరించి.. పరిస్థితి చక్కబడిన తర్వాత చ‌ర‌ణ్ తో మేజర్ పార్ట్ షూట్ చేయాల‌నుకున్నా ప్లాన్ మార్చి ఇప్పుడు అత‌డిపై సీన్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆచార్య‌కు ఏమాత్రం అడ్డంకులు లేకుండా చ‌ర‌ణ్ కి లైన్ క్లియ‌ర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండ‌డం పై తాజాగా లీకులు అందాయి. షూటింగ్ ప్రారంభమైన వెంటనే రామ్ చరణ్ చేయాల్సిన భాగాన్ని చిత్రీకరిస్తార‌ట‌. మొన్నటి భేటీలో తమ సినిమా కోసం చరణ్‌ను పంపాలని చిరంజీవి కోరడంతో జ‌క్క‌న్న కాద‌న‌లేక‌పోయార‌ని తెలుస్తోంది. ఇక ఆచార్య‌లో చ‌ర‌ణ్ 40 నిమిషాల నిడివి ఉన్న పాత్ర‌లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ వ‌చ్చే వ‌ర‌కూ కొర‌టాల ఇత‌ర స్టార్ల‌పై స‌న్నివేశాల్ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.
Tags:    

Similar News