మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పూరీ జగన్నాధ్ తీసిన లోఫర్ ఆడియో ఫంక్షన్ కు పలు కారణాలతో మెగాస్టార్ చిరంజీవి హాజరు కాలేదు. అయితే.. తన దీవెనలు, అభినందనలు మాత్రం ఓ వీడియో ద్వారా పంపారు మెగాస్టార్.
"లోఫర్ యూనిట్, పూరీ జగన్నాధ్ గారికి, వరుణ్ తేజ్ కి అభినందనలు. మూడు సినిమాలతోనే పూరి లాంటి డైరెక్టర్ తో చేసే ఛాన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. పెద్ద అడుగులు వేస్తూ దుసుకుపోతున్న వరుణ్ కు తేజ్.. పెద్ద స్టార్ అవాలని కోరుకుంటున్నాను. నేను లోఫర్ ట్రైలర్ చూశాను. విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. పూరీ మార్క్ కొట్టొచ్చినట్లుగా కనిపించింది. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన పూరీ సినిమాలన్నీ హిట్సే. ఇది కూడా హిట్ అవాలని కోరుకుంటున్నా " అన్నారు మెగాస్టార్ "మా ఫ్యామిలీలో పవన్ కు బద్రి - చరణ్ కు చిరుత - బన్నీకి దేశముదురు లాంటి హిట్స్ ఇచ్చారు పూరీ. వరుణ్ కి లోఫర్ తో ఆ హిట్ హిస్టరీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. పాటలు బాగున్నాయి. బీజీఎం సూపర్బ్ గా ఉంది. సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు" అని చెప్పుకొచ్చారు.
వేడుకకు రానందుకు వీడియో ద్వారా సందేశాన్ని చిరు పంపారు కానీ.. మాటల్లో పూరీ జగన్నాధ్ గారు.. అంటూ పలకడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. సాధారణంగా పూరీ జగన్ అని మాత్రమే సంబోధించే చిరంజీవి, ఇప్పుడు పూరీ జగన్నాధ్ గారు అనడానికి కారణం? సర్లేండి.. మరీ బియ్యంలో రాళ్ళేరితే అంత బాగోదు!!