దేశానికి రాజయినా అమ్మకు కొడుకే అంటారు.. కొడుకు ఎంతవాడైనా తల్లికి ఇంకా చిన్నపిల్లవాడే! మరి స్టార్ హీరోల తల్లి తన కుమారుడి గురించి ఎలా ఆలోచిస్తుంది? అభిమానులకే కాదు తనకు కూడా అభిమాన నటుడే అని భావిస్తుంది. ఈ విషయం తాజాగా మెగాస్టార్ చిరంజీవి అమ్మ గారి విషయంలో జరిగింది. పెద్ద కొడుకు సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత 60 సంవత్సరాలు దాటిన తర్వాత కుర్రాడిలా చెలరేగిపోతుంటే ఆ అమ్మ ఇంట్లో ఉండలేకపోయారు. అందరి అభిమానుల్లాగానే మొదటి రోజు మొదటి షో కి అంత రష్ పరిస్థితుల్లోనూ వెళ్లారు!
గతంలో ఎన్నడూ లేనట్లుగా మెగాస్టార్ తల్లి "ఖైదీ" ని చూసేందుకు స్వయంగా థియేటర్ కు తరలివచ్చారు. హైదరాబాద్ - ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటరులో చిరంజీవి తల్లి అంజనాదేవి ఈ సినిమాను చూశారు. ఈ సమయంలో అంజనాదేవి తో పాటు చిరు సతీమణి సురేఖ - వీరితో పాటు హీరో అల్లు అర్జున్ దంపతులు కూడా ఆమెతోపాటు వచ్చారు. దీంతో "బాస్ ఈజ్ బ్యాక్" - "స్టైలిష్ స్టార్" అంటూ అభిమానులు కేరింతలు - నినాదాలతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలతో సంథ్య థియేటర్ ప్రాంగణం దద్దరిల్లిపోయిందనే చెప్పాలి. ఈ సమయంలో చిరు కుటుంబాన్ని థియేటర్ లోకి పంపేందుకు పోలీసులు - బౌన్సర్లు నానా ఇబ్బందులూ పడాల్సి వచ్చింది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/