జూన్ నెల నుండి మెగాస్టార్ 150వ సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో క్యాలెండర్ లో జూన్ నెల కనిపించనుంది. ఈ తరుణంలో అసలు చిరంజీవి ఇంకా షూటింగుకు పచ్చజెండా ఊపలేదని ఒక రిపోర్టు వినిపిస్తోంది. ఎందుకలా?
నిజానికి ''కత్తి'' రీమేక్ కోసం చిరంజీవి ఒక 10 కేజీలు తగ్గాలని ఫిక్సయ్యారు. అందుకు శ్రీజ పెళ్ళి తరువాత నుండి కసరత్తులు చేస్తున్నారు. అయితే ముఖంలో కళ తగ్గకుండా వెయిట్ లాసవ్వాలంటే మాత్రం కాస్త కష్టపడాల్సిందే. కడుపు మాడ్చుకుని 10 కేజీలు ఈజీగా తగ్గిపోవచ్చు కాని.. అలా చేస్తే ముఖం మొత్తం పేలగా అయిపోతుంది. అందుకే చిరంజీవి వేరే జిమ్ రొటీన్స్ ద్వారా వెయిట్ తగ్గుతున్నారట. అయితే ఈ ప్రాసెస్ లో ఆయన జూన్ లోపు 10 కిలోలు కట్ చేద్దాం అనుకుంటే.. ఇప్పటికి కేవలం 6 కిలోలే తగ్గారు. అందుకే ఇంకో 4 కేజీల బరువు కడా తగ్గాకనే షూటింగ్ కు వస్తారేమో అనే సందేహాలు ఇప్పుడు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి దర్శకుడు వివి వినాయక్ మాత్రం.. ఒక్క హీరోయిన్ తప్పించి తదుపరి క్యాస్టింగ్ అంతా ఫైనల్ చేస్తున్నారు. మరి మెగా వెయిట్ ఎప్పుడు తగ్గుతారు.. షూటింగ్ ఎప్పుడు మొదలెడతారు సార్?