గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగమైన చిరంజీవి - పవన్ కళ్యాణ్

Update: 2020-07-26 10:08 GMT
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' విస్తృతంగా నడుస్తోంది. 'పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే' అనే నినాదంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మూడో దశకు చేరుకున్న 'గ్రీన్ ఛాలెంజ్' లో అందరూ పాల్గొని చెట్లను నాటడంతో పాటు ఇతరులను నామినేట్ చేస్తూ మొక్కలు నాటించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వాలు అటవీ సంపదను పెంచి కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న ఈ ఛాలెంజ్ లో సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజలు వరకు అందరూ భాగస్వామ్యం అవుతున్నారు. 3 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్ టార్గెట్ రీచ్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా జూబ్లీ హిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ మరియు జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే భారీ కార్యక్రమమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్‌ తో పాటు మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను - అనిల్ రావిపూడి మరియు ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా నడుస్తున్న ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి.. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గినాలని సూచిస్తూ భవిష్యత్తులో మొక్కల ఆవశ్యకత గురించి చిరంజీవి వివరించారు.
Tags:    

Similar News