చిరంజీవి వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేశారు. ఆ సినిమాల్లో ముందుగా 'ఆచార్య'ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన థియేటర్లకు వచ్చింది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. కథాకథనాల పరంగా .. పాత్రలను డిజైన్ చేసే తీరులోనూ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. చిరంజీవి - చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి ఇలాంటి టాక్ రావడం పట్ల అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సీనియర్ నటి రాధిక నుంచి ఒక ప్రకటన వచ్చింది. తన బ్యానర్లో మెగాస్టార్ ఒక మెగా ప్రాజెక్టు చేయనున్నట్టుగా అధికారికంగా వెల్లడించింది. రాధిక తన సొంత బ్యానర్ 'రాడాన్'ను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ బ్యానర్ పై ఆమె ఒక వైపున సీరియల్స్ .. మరో వైపున సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. కథాకథనాల విషయంలో రాధికకి మంచి పట్టుంది. ఆమె నిర్మించిన ధారావాహికలు చాలా వరకూ హిట్. అందువలన ఆమె బ్యానర్ పై మంచి క్రేజ్ ఉంది.
ఇక చిరంజీవితో రాధికకి మంచి స్నేహం ఉంది. చిరంజీవి సినిమా 'న్యాయం కావాలి' తోనే తెలుగు తెరకి రాధిక పరిచయమైంది. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో 'యమకింకరుడు' .. 'అభిలాష' .. 'దొంగమొగుడు' మొదలైన సినిమాలు వచ్చాయి. తన అభిమాన నటుడు .. తనకి మంచి స్నేహితుడు చిరంజీవి అని రాధిక పలు సందర్భాల్లో చెప్పారు. గతంలో కూడా చిరంజీవితో ఒక ప్రాజెక్టు చేయాలనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తాజాగా ఆమె చిరూతో ఒక భారీ ప్రాజెక్టు చేయనున్నట్టు స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆమె పూర్తి సమాచారం ఇవ్వలేదు. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. 'ఆచార్య' విషయంలో అభిమానులు అసంతృప్తితో ఉన్నప్పుడు ఆమె ఈ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుతం చిరంజీవి పట్టాలెక్కించిన సినిమాల్లో 'గాడ్ ఫాదర్' .. ' భోళా శంకర్' .. 'వాల్తేరు వీరయ్య' సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో ఐదు ప్రాజెక్టులు లైన్లో ఉన్నట్టుగా చిరంజీవి ఇటీవల చెప్పారు. ఆ ఐదింటిలో ఇది ఒకటిగా అనుకోవాలేమో!