అడిగిన వారికి కాదనకుండా ఇచ్చేస్తున్న చిరంజీవి.. ఈసారి స్నేహితురాలి కోసం!

Update: 2022-05-03 02:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి ఎంత పెద్ద స్టార్‌ అయినా కూడా చిలిపితనం పోలేదు. ఆయన ఇంకా కూడా కుర్రతనపు చేష్టలతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. సినిమాలో చాలా హుందాగా సీరియస్ గా కనిపించినా కూడా నిజ జీవితంలో మాత్రం ఆయన చాలా జోవియల్‌ గా కనిపిస్తూ ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. చిన్న వారితో పెద్ద వారితో ఒకే విధంగా మాట్లాడుతూ భోళా అనే టైటిల్‌ ను దక్కించుకున్నాడు.

ఎవరు ఏం అడిగినా కాదు అనడు అంటూ మెగా స్టార్‌ చిరంజీవికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇప్పుడు అదే ట్యాగ్‌ లైన్ ఆయన వరుస సినిమాలు కమిట్ అయ్యేలా చేస్తుంది అంటూ టాక్‌ వినిపిస్తుంది. ఇటీవల ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ గాడ్‌ ఫాదర్ మరియు భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆ తర్వాత వాల్తేరు వీరన్న సినిమా మరియు వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. మొత్తానికి మెగా స్టార్‌ చిరంజీవి సినిమాల జాతర కంటిన్యూ అవ్వబోతుంది. ఇన్ని సినిమాలు లైన్ లో ఉన్నా కూడా చిరంజీవి మరి కొన్ని సినిమాలకు కూడా ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే కూతురు సుష్మిత సొంత సంస్థ అయిన గోల్డ్‌ బాక్స్ బ్యానర్‌ లో సినిమా చేయబోతున్నాడట.

కూతురు బ్యానర్‌ లో సినిమా తో పాటు తనకు ఆప్త మిత్రురాలు అయిన రాధిక బ్యానర్‌ లో కూడా ఒక సినిమాను చిరంజీవి చేయబోతున్నాడట. సీనియర్‌ హీరోయిన్ రాధిక ప్రొడక్షన్ హౌస్ లో కూడా చిరంజీవి సినిమాను చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.. ఆ విషయాన్ని స్వయంగా రాధిక తెలియజేసింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను వెళ్లడించబోతున్నట్లుగా పేర్కొంది.

ఈమద్య కాలంలో స్టార్‌ హీరోలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు అన్నట్లుగా చేస్తున్నారు. కాని చిరంజీవి మాత్రం రెండు మూడు నెలలకు ఒక సినిమాను ముగించాలనే ఉద్దేశ్యంతో సినిమాలను కమిట్‌ అవుతున్నాడు. కరోనా వల్ల సినిమాలు ఆలస్యం అయినా కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలను విడుదల చేసేలా చిరంజీవి జోరుమీదున్నాడు.

అడిగిన వారికి కాదు అనకుండా డేట్లు ఇచ్చేస్తున్న చిరంజీవి కథ విషయంలో కూడా కాస్త సీరియస్ గా ఉండాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆచార్య సినిమా ఫలితం పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ చిరు కు ప్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. రాధిక మరియు చిరంజీవి కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. రాధిక ఫ్యామిలీ ఫ్రెండ్‌ అంటూ చిరు పలు సందర్బాల్లో చెప్పాడు.

ఇప్పుడు స్నేహితురాలి కోసం డేట్లను ఇచ్చాడు. మరి స్నేహితురాలి వద్ద పారితోషికంగా చిరంజీవి ఎంత మొత్తం ను తీసుకున్నాడు అనేది చర్చ. ఆప్త మిత్రురాలు కనుక పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా ను చిరు తీసుకుంటాడేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News