సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోల మధ్య ఈగోలు ఉంటాయనే మాట ఎప్పటి నుంచో వింటూనే ఉంటాం. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఆధిపత్య పోరు వర్గపోరు ఉంటుందని ఇండస్ట్రీని దగ్గరగా ఉండి చూసిన వారు అభిప్రాయపడుతుంటారు. ఇండస్ట్రీలో విబేధాలు లేకుండా ఎవరు ఉండరని.. బయటకు అంతా ఒకటని చెబుతూనే లోపల మాత్రం తిట్టుకుంటారనే టాక్ ఉంది. దీనిని నిజం చేస్తూ అనేక సందర్భాల్లో బహిరంగంగానే పరస్పర ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. ఇటీవల సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో సమావేశాలకు.. చిరంజీవి ఇంట్లో జరిగిన మీటింగ్ కి తనను ఆహ్వానించకపోవడంపై బాలకృష్ణ బహిరంగ విమర్శలు చేయడం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ బాలయ్య పలు విమర్శలు కూడా చేశారు. దీంతో ఇప్పట్లో వీరి మధ్య వివాదం సమసిపోయేలా లేదని అందరూ అనుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి అవేమీ పట్టించుకోకుండా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భం గా బర్త్ డే విషెస్ చెప్పి వివాదం ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే ఇండస్ట్రీలో ఆధిపత్యం కోసం కావాలనే చాలా మంది తమ స్వలాభం కోసం చేస్తున్నారని ఇండైరెక్ట్ గా చిరంజీవి పై ఊహించని విధంగా బాలయ్య స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా దాసరి లేని లోటు ఎవరూ తీర్చ లేరని.. ఆయన శిష్యుడు సి. కళ్యాణ్ మాత్రం అంతో ఇంతో ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడని వ్యాఖ్యానించారు. దాసరి మరణం తర్వాత ఇండస్ట్రీ అభివృద్ధి కోసం.. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి పేరు బాలయ్య కావాలనే చెప్ప లేదని మెగా అభిమానులు కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. బాలయ్య కామెంట్స్ కి త్వరలోనే కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. అయితే ఆ కౌంటర్ తన నెక్స్ట్ సినిమాలో డైలాగ్స్ రూపంలో ఇవ్వబోతున్నాడట. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ ఈ సినిమాలో తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ కి అలాగే తప్పుడు ప్రచారాలకు కౌంటర్ ఇచ్చే విధంగా డైలాగ్స్ తో కౌంటర్ ఇవ్వనున్నారట. గతంలో 'ఖైదీ నెం. 150' సినిమాలో కూడా చిరు 'రాననుకున్నారా రాలేననుకున్నారా' 'ఎన్ని దెబ్బలు తిన్నా.. తట్టుకున్న గుండె ఇది' లాంటి డైలాగ్స్ తో తనపై వస్తున్న కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులలో 'ఆచార్య' సినిమాలో కూడా అదే తరహాలో తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారికి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సినిమాల్లో ఇలా ఒకరిపై ఒకరు డైలాగ్స్ తో కౌంటర్ ఇవ్వడం మనం చాలానే చూశాం. ఇటీవల బాలయ్య కూడా తన కొత్త సినిమాలో డైలాగ్ తో ఎవరినో టార్గెట్ చేసారని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో చిరు కూడా రెడీ అయ్యారని తెలుస్తోంది. మరి ఈ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయో తెలియాలనంటే 'ఆచార్య' రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.