దసరా సందర్భంగా ప్రతీ ఏడాది కేంద్ర మాజీ మంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ `అలయ్ బలయ్` కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా అలయ్ బలయ్` కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింమారావు సభా వేదికగా చినంజీవిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి.
సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారు దత్తాత్రేయ ఫ్యామిలీ చిరుతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతున్నారు. ఆ ఫొటో సెషన్ ని ఆపేసి వేదికపైకి రావాలని, లేదంటే తాను వెళ్లిపోతానని గరికపాటి నరసింహారావు వివదాస్పందంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాజాగా గురువారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన చిరంజీవి..గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
గురువారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన మెగాస్టార్ ఓ పాత్రికేయుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా ఈ వివాదాన్ని ఒక్క మాటలో తేల్చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆయన పెద్దాయన.. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు` అని ఒక్క మాటలో తేల్చేయడం ఆసక్తికరంగా మారింది. చిరు `పెద్దాయన` అంటూ ఒక్క మాటతో తేల్చేయడంతో వివాదం ముగిసినట్టయింది.
ఇక `ఆచార్య` ఫ్లాప్ పై కూడా ఈ సందర్భంగా స్పందించారు చిరు. ఏ సినిమా ఫ్లాప్ అయినా తాను బాధ్యత తీసుకుంటానని, `ఆచార్య` ఫెయిలైనందుకు తాను బాధపడలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా 80 శాతం పారితోషికాన్ని తాను, చరణ్ తిరిగి వెనక్కు ఇచ్చేశామని, అయితే ఈ విషయం పెద్దగా బయటికి రాలేదన్నారు. ఇక `ఆర్ ఆర్ ఆర్` విజయం కన్నా చరణ్ `గాడ్ ఫాదర్` సక్సెస్ నే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాడన్నారు.
ఇక చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ అవన్నీ వేసవి కల్ల విడుదలవుతాయని, మార్చిలో కొత్త ప్రాజెక్ట్ లు ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. దర్శకుడు బాబీతో చేస్తున్న సినిమాలో తన పాత్ర పూర్తి స్థాయి మాసీవ్ గా వుంటుందని, సంభాషణలు తూర్పుగోదావరి యాసలో వుంటాయన్నారు. దీపావళికి బాబితో చేస్తున్న సినిమా మోషన్ పోస్ట్ ర్, టైటిల్ ని విడుదల చేస్తున్నామన్నారు.