ఒక స్టార్ హీరో ఎలా ఆదర్శవంతం అవుతాడు? అనేదానికి మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రజలు- అభిమానులు కష్టంలో ఉన్నానని పిలిస్తే చాలు ఆయన పలుకుతారు. ఇంతకుముందు కరోనా కష్ట కాలంలో రెండు వేవ్ లలో ప్రజల్ని అప్రమత్తం చేసి వారికి తాను అండగా నిలుస్తానని బహిరంగంగా ధైర్యం చెప్పిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి. ఓవైపు కరోనా సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా వారికి ధైర్యం నూరిపోసేందుకు ఆయన బహిరంగ వేదికలకు వచ్చారు. సినీపరిశ్రమ కార్మికులకు నేను సైతం అంటూ ప్రాణాలు నిలబెట్టుకునేందుకు అవసరమైన నిత్యావసరాల సాయం నిరంతరంగా అందించారు. అభిమానులకు కరోనా సోకితే ఆస్పత్రులతో మాట్లాడి అప్రమత్తం చేసి ప్రాణాలు కాపాడారు. ఆర్టిస్టులు అభిమానులకు విరివిగా ఆర్థిక విరాళాలు అందించారు.
ఇక మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. దశాబ్ధాల పాటు ఆయన రక్తదానం కళ్ల దానానికి సంబంధించిన సేవలు నిరంతరం చేస్తూనే ఉన్నారు. తలసేమియా అనే అరుదైన ప్రాణాంతక వ్యాధి సోకిన వారికి నిరంతరం చిరంజీవీ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని దానమిస్తూనే ఉన్నారు. దీనికోసం అభిమానులు నిరంతరం రక్తదానానికి ముందుకు వస్తున్నారు.
ఇదంతా ఒకెత్తు అనుకుంటే తన అభిమానుల్ని చిరు ఎంతగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారో ప్రూఫ్ గా ఈ ఘటన నిలిచింది. నిన్నటి రేయి భారీ వర్షం సాక్షిగా ఆయన మంచి మనసు నిరూపణ అయ్యింది. ఓవైపు రాయలసీమ అనంతపురంలో 'గాడ్ ఫాదర్' మూవీ ప్రీరిలీజ్ వేడుక భారీగా సాగుతుంటే ఇంతలోనే వర్షం జోరున కురిసింది. దీనికి ఏమాత్రం కథానాయకుడు చిరు కానీ ఇతర చిత్రబృందం కానీ అభిమానులు కానీ తడబడలేదు. సరికదా ఈ భారీ వర్షాన్ని కూడా తమ ప్రచారంలోకి తెచ్చేసారు.
చిరు తాను ఎప్పుడు వచ్చినా రాయలసీమలో వర్షం పడుతుందని ఓకింత గర్వంగానే చాటుకున్నారు. అయితే అది నిజం కూడా. మెగాస్టార్ రాజకీయ ప్రచారంలో కానీ.. ఇంద్ర సినిమా రెయిన్ సాంగ్ చిత్రీకరణ సమయంలో కానీ (సీమలో చిత్రీకరణ సమయంలో) నేచురల్ గానే వర్షం పడింది. దీంతో చిరు వెంట వరుణుడు ఉంటాడని రాయలసీమ ప్రజలు భావిస్తుంటారు. అది మరోసారి గాడ్ ఫాదర్ వేదిక సాక్షిగా నిరూపణ అయ్యింది. ఇక రాయలసీమలో మాస్ అభిమానులు చిరుకు బ్రహ్మరథం పడతారన్నది తెలిసినదే.
ఇక నిన్నటి ఈవెంట్లో వర్షం పడుతుంటే చిరు తడవకుండా వెంట ఉన్న సెక్యూరిటీ బృందం అభిమానులు ఆయనకు గొడుగు పట్టాలని చూసారు. కానీ అందరూ తడుస్తూ తనకు అలా చేయటం వద్దంటూ చిరు అనునయించడమే గాక తాను కూడా వర్షం లో తడిసారు చిరు. ఒక నిజమైన స్టార్ ప్రజలకు ఎలా స్ఫూర్తిగా నిలవాలో చూపించిన దృశ్యమది.
ఇక ఇదే వేదికపై తన ప్రసంగానికి ముందు.. మహేష్ బాబు మాతృమూర్తి దివంగత ఇందిరాదేవి గారికి నివాళులు అర్పించారు. అంతేకాదు నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా.. గణేష్ నటించిన స్వాతిముత్యం సినిమా కూడా విజయం సాధించాలని కోరుతూ తన గొప్ప మనసును చాటుకున్నారు. అందుకే ఆయనను అందరూ అన్నయ్య అని కూడా పిలుస్తారు. టాలీవుడ్ పెద్దరికం డిబేట్ లో మెగాస్టార్ చిరంజీవికి వ్యతిరేకంగా గళం విప్పినవారు ఉన్నారు. వారంతా నేర్చుకోవాల్సిన అరుదైన క్వాలిటీస్ ఇవన్నీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.