'సైరా' కి చిరు డ‌బ్బింగ్ మొద‌లెట్టేశారు

Update: 2019-06-17 14:42 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌యింది. ఒకే ఒక్క వీఎఫ్ ఎక్స్ సీన్ కి సంబంధించిన‌ ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా  ఓవ‌రాల్ గా టాకీ షూటింగ్ పూర్తి చేసేశారు. బ్యాలెన్స్ ప్యాచ్ వ‌ర్క్ ని కేవ‌లం రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేసేయ‌నున్నార‌ట‌. అంత‌కుమించి హాట్ న్యూస్ తాజాగా రివీలైంది.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికే డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లు పెట్టేశారు. హైద‌రాబాద్ శ‌బ్ధాల‌య స్టూడియోస్ లో చిరు డ‌బ్బింగ్ చెబుతున్నారు. మ‌రోవైపు సైరాకి సంబంధించిన ప్ర‌తిదీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సురేంద‌ర్ రెడ్డి- చ‌ర‌ణ్ ఎంతో కేర్ ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నార‌ట‌. సైమ‌ల్టేనియ‌స్ గా వీఎఫ్ ఎక్స్ కి సంబంధించిన ప‌నుల్ని ర‌క‌ర‌కాల స్టూడియోల్లో గా పూర్తి చేస్తున్నారు. అందుకోసం వ‌ర‌ల్డ్ క్లాస్ స్టూడియోస్ ని ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్టు నాటికి పూర్తి స్థాయి ఔట్ పుట్ రానుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ తేదీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ట‌.

మ‌రోవైపు అభిమానుల్లో ఈ సినిమా రిలీజ్ తేదీ గురించి ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. సైరా చిత్రాన్ని గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2న రిలీజ్ చేస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే టీజ‌ర్ ని స్వాతంత్య్ర దినోత్స‌వ కానుక‌గా ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తార‌ని భావిస్తున్నారు. వీరాధివీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కోసం కొణిదెల ప్రొడక్ష‌న్స్ కంపెనీ దాదాపు 200 కోట్లు పైగా ఖ‌ర్చు చేస్తోంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు.


Tags:    

Similar News