చిరు కోసం చరిత్రను మారుస్తున్నారా?

Update: 2018-08-02 06:16 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తొలి తెలుగు ఫ్రీడం ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై తెరకెక్కుతున్న 'సైరా' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  నరసింహారెడ్డిగా మెగాస్టార్ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చరణ్ నిర్మాత.

ఈ సినిమాగురించి ఫిలిం నగర్లో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.  ఈ సినిమా క్లైమాక్స్ ను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. చరిత్ర ప్రకారం అయితే ఉయ్యాలవాడ ను కోయిలకుంట్ల లో పట్టుకుని బంధించిన తర్వాత బ్రిటిష్ వారు ఉరి తీస్తారు. కానీ ఇలాంటి హార్డ్ క్లైమాక్స్ ఉంటే మెగా ఫ్యాన్స్ దానిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే విషయంలో చరణ్ కు అనుమానాలు ఉన్నాయట.  చిరంజీవిని అలా ఉరితీసే ఎండింగ్ ను మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేరేమో అనే అనుమానంతో క్లైమాక్స్ ను మార్చమని డైరెక్టర్ సురేందర్ రెడ్డికి చెప్పాడని సమాచారం.

అలా చేయాలంటే  సురేందర్ రెడ్డి దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి.  ఒకటి ఉరి తీసే సీన్ ను చూపకుండా.. ఉరి తీశారని వాయిస్ ఓవర్ ద్వారా చెప్పించడం లేదంటే అసలు ఉరే తీయలేదని చెప్పి చరిత్రను వక్రీకరించడం.  రెండో ఆప్షన్ కు కనుక వోటేస్తే విమర్శకులు చెలరేగడం మాత్రం ఖాయం.   ఏదేమైనా ఇవన్నీ క్లైమాక్స్ ను నిజంగా మార్చే ప్రయత్నం చేసినప్పుడు వచ్చే డిస్కషన్ మాత్రమే.  ఒకవేళ ఉన్నదున్నట్టుగా చూపిస్తే ఏ గొడవా ఉండదు.
Tags:    

Similar News