లండన్ లో ఉయ్యాలవాడకు ఫైనల్ టచ్

Update: 2017-04-13 06:07 GMT
మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేస్తున్న విషయం విదితమే. అధికారిక ప్రకటన రాలేదు కానీ.. దర్శకుడు సురేందర్ రెడ్డి.. రచయితలు పరుచూరి బ్రదర్స్.. ఇప్పుడు కథను ఫైనలైజ్ చేసే పనిలోనే ఉన్నారు. వీరు గత చరిత్ర తెలుసుకోవడంలో దర్శకుడు క్రిష్ ను స్ఫూర్తిగా తీసుకోవడం విశేషం.

1వ శతాబ్ద కాలం నాటి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఇక్కడ పెద్దగా ఏమీ దొరకని సమయంలో.. లండన్ మ్యూజియంలో మాత్రం సినిమాకు సరిపడేంతటి ముడి సరుకు పొందగలిగాడు క్రిష్. బ్రిటిషర్లు మన సంపదతో పాటు.. చారిత్రక ఆనవాళ్లను కూడా బ్రిటన్ కు తరలించేసుకున్నారు. అందుకే.. ఇక్కడ మనకు చారిత్రక ఆనవాళ్లు అంతగా దొరకవు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ రాయలసీమ వీరుడి గురించి మరింతగా శోధిద్దామని చేసే ప్రయత్నాలు ఇక్కడ నెరవేరలేదు కానీ.. లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉన్న దక్షిణ భారత విభాగంలో మాత్రం ఉయ్యాలవాడకు సంబంధించిన పలు వివరాలు తెలిశాయట.

వాటి ఆధారంగానే ఇప్పుడు ఆ కథకు కొత్త టచెస్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇంత కాలం మాస్ మసాలా సినిమాలకే మొగ్గిన మన తెలుగు స్టార్ హీరోలు.. ఇప్పుడు తెలుగు చరిత్రను అందించే ప్రయత్నం చేస్తుండడం మాత్రం ప్రశంసనీయమైన విషయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News