బాహుబలి వల్లే సైరాకు ధైర్యం చేశామంటున్న చిరు

Update: 2019-08-23 14:57 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ చిత్రం 'సైరా'.  అన్ని దక్షిణాది భాషలతో పాటుగా హిందీలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈమధ్యే రిలీజ్ అయిన 'సైరా' టీజర్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన దక్కింది. బాహుబలి తర్వాత టాలీవుడ్ ఫిలిం మేకర్స్ టేకప్ చేసిన భారీ చిత్రాల్లో ఒకటి 'సాహో' కాగా రెండోది 'సైరా'.   ఇక రాజమౌళి 'RRR' ఎలాగూ ఈ భారీ చిత్రాల లిస్టులో ఉంటుంది.

రీసెంట్ గా 'సైరా' టీజర్ రిలీజ్ కావడంతో అందరి ఫోకస్ ఇప్పుడు 'సైరా' పైనే ఉంది.  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి 'సైరా' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. "ఈ సినిమాకు దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ అయిందంటున్నారు.. ఇంత భారీ బడ్జెట్.. ఎలా ధైర్యం చేశారు?" అని అడిగితే "బాహుబలి సినిమా వల్లే మేము ధైర్యం చేశాము.  మేము పెట్టుబడి గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. కలెక్షన్స్.. ఇతర మార్గాల ద్వారా పెట్టుబడి వెనక్కు వచ్చేస్తుంది. ఇదంతా బాహుబలి చలువే" అంటూ క్రెడిట్ 'బాహుబలి' కి ఇచ్చారు.   'సైరా' ను ఎందుకు ఎంచుకున్నారు అని చిరును అడిగితే "ఈ కథ చాలా ఏళ్ళ నుంచి నా మనసులో ఉంది.  దేశభక్తి ఉన్న కథ.. యాక్షన్ సన్నివేశాలతో పాటుగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి.  ఇవే కాకుండా కథలో బాక్స్ ఆఫీస్ విజయానికి అవసరమైన కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి" అని వెల్లడించారు.

మెగాస్టార్ 'ఖైది నెం.150' తో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు రెండేళ్ళ సమయం 'సైరా కోసం వెచ్చించారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నాన్నగారికి ఒక అద్భుతమైన చిత్రం అందించాలనే తపనతో నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమాకోసం భారీగా ఖర్చుపెట్టాడని సమాచారం.  'సైరా' అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమా ఘనవిజయం సాధిస్తే టాలీవుడ్ ఖ్యాతి మరింతగా పెరుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Tags:    

Similar News