ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ప్రవేశించి తన స్వయంకృషితో 'మెగాస్టార్' గా ఎదిగారు చిరంజీవి. కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్న చిరు.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. వందల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి నుంచి టాలీవుడ్ లోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్ హీరో అనిపించుకున్నారు.
ఇప్పటివరకు 150 కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి.. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కి రూ.25 - 30 కోట్ల వరకూ తీసుకుంటున్నారని టాక్. సినిమాల్లోనే కాకుండా పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో విలువైన ఆస్తులు సమకూర్చుకున్నారు. ఎంత సంపాదించినా అందులో కొంతభాగం సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు.
తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. చిరు తనకు సంబంధించిన ఓ ఖరీదైన స్థలాన్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. అప్పట్లో చిరు ఫిలిం నగర్ ఏరియాలో కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. దాని విలువ సుమారు 30 లక్షలుగా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే వారం రోజుల క్రితం ఆ స్థలాన్ని అమ్మేసినట్లు టాక్ వినిపిస్తోంది.
చిరు అమ్మిన ఆస్తి విలువ ప్రస్తుతం రూ. 70 కోట్లు ఉంటుందని అంటున్నారు. అయితే సీనియర్ హీరో అంత విలువైన స్థలాన్ని ఇప్పుడు అమ్మడానికి గల కారణాలు ఏంటని అభిమానులు ఆలోచిస్తున్నారు. మంచి ధర రావడంతో ఆ స్థలాన్ని విక్రయించారే తప్ప.. మరే ఇతర కారణాలు లేవని ఫిలిం నగర్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యువ హీరోలకు ధీటుగా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్స్ చేస్తున్నారు. ఇప్పటికే 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి 'భోళా శంకర్' అనే కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. అలానే బాబీ (కేఎస్ రవీంద్ర) తో కలిసి 'వాల్తేరు వీరయ్య' అనే మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. 2023 సంక్రాంతి పండక్కి ఈ సినిమా విడుదల ప్లాన్ చేశారు.
యువ దర్శకులు వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ ఓ మూవీకి కమిట్ అయ్యారు. అలానే మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తానని ప్రకటించారు. ఇవి కాకుండా మరికొన్ని కథలు చిరంజీవి పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.