మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న 'ఆచార్య' కి కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించనున్నారని తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్నారని సమాచారం. ఈ రీమేక్ కు ముందుగా 'సాహో' ఫేమ్ సుజిత్ ని దర్శకుడిగా అనుకున్నప్పటికీ చివరికి ఈ రీమేక్ ప్రాజెక్ట్ మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతిలోకి చేరింది. చిరంజీవితో ఇంతకముందు 'ఠాగూర్' 'ఖైదీ నెం.150' వంటి రీమేక్ సినిమాలను సమర్థవంతంగా తెరకెక్కించిన వీవీ వినాయక్ మీద నమ్మకంతో 'లూసిఫర్' స్క్రిప్ట్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
కాగా, చిరంజీవి సూచనలకు అనుగుణంగా వినాయక్ తన టీమ్ తో కలిసి మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేర్పులు చేసాడట. అంతేకాకుండా ఇటీవల మెగాస్టార్ ని కలిసి తన వర్షన్ స్క్రిప్ట్ ని కూడా వినిపించాడని.. చిరుకి ఈ స్క్రిప్ట్ నచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే 'ఆచార్య' తర్వాత 'లూసిఫర్' రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 'ఆచార్య' సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో వినాయక్ ప్రాజెక్ట్ ని 2021 ప్రథమార్థంలో స్టార్ట్ చేయొచ్చు. ఇక దీని తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ 'వేదలమ్' సినిమాని రీమేక్ చేస్తారని తెలుస్తోంది. దీంతో పాటు 'జై లవకుశ' 'వెంకీమామ' దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) తో కూడా మెగాస్టార్ ఓ సినిమా చేయనున్నాడు.