మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున మధ్య వార్ పిక్సైన సంగతి తెలిసిందే. హీరోలిద్దరు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ పోరుకి రెడీ అవుతున్నాయి. చిరంజీవి నటిస్తోన్న 'లూసీఫర్'.. కింగ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది ఘోస్ట్' ఒకే రోజు అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్నాయి. దీంతో సక్సెస్ పై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. స్టార్ హీరోలిద్దరు సక్సెస్ అందుకుంటారా? లేక దసరా సీజన్ నాది మాత్రమేనని ఎవరో ఒకరు ప్రూవ్ చేసుకుంటారా? అన్నది వేచి చూడాలి.
అయితే అగ్ర హీరోలు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడం అన్నది ఇప్పుడు జరగడం లేదు. అది జమానా కాలం నాటి మాట. ఒకప్పుడు హీరోల మధ్య గట్టి పోటీ ఉండేది కాబట్టి..నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ పడి రిలీజ్ అయ్యేవి. ఇప్పుడంత సీన్ లేదు. బాక్సాఫీస్ లెక్కలు పరిగణలోకి తీసుకుని ఏదో ఒక హీరో చివరి నిమిషంలో వెనక్కి తగ్గుతున్నారు.
నిర్మాతల అండర్ స్టాండింగ్ సహా హీరోలిద్దరు కూర్చొని మాట్లాడుకుని రిలీజ్ తేదీల్ని మార్చుకుంటున్నారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు. చిరు..నాగ్ మధ్య అలాంటి సన్నివేశం తప్పనిసరి. అయితే ఇక్కడ చిరంజీవి వెనక్కి తగ్గుతారా? నాగార్జున ఆగిపోతారా? అన్నదే ఆసక్తికరం. 'లూసిఫర్' అక్టోబర్ 5న రిలీజ్ అవుతుందని కొన్ని నెలలుగా వినిపిస్తుంది.
ఇటీవలే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ది ఘెస్ట్ ప్రకటన తేదీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి హీరోల్లో ఎవరు కాంప్రమైజ్ అవుతారు అన్నది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక చిరంజీవి-నాగార్జున స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు ఎంతో కాలంగా క్లోజ్ ప్రెండ్స్. ఇండస్ర్టీ లో మెగాస్టార్ ఇమేజ్ గురించి నాగ్ ఎంతో గొప్పగా చెబుతుంటారు.
ఇటీవలే టాలీవుడ్ ని ఏల్తోన్న స్టార్ అని సైతం నాగ్ అన్నారు. ఇక చిరు సైతం నాగ్ ని అంతే గౌరవిస్తారు. ఆయన ఎంతో అభిమానించి ఇష్టపడే నటుడు నాగ్. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఐదేళ్లు ఉంది. నాగ్ కన్నా చిరంజీవి ఐదేళ్లు పెద్దవారు. ఈ ప్రాతిపదికన చిరంజీవిని గౌరవించి నాగ్ సైడ్ అవుతారా? లేక నాగార్జున కోసం చిరునే తప్పుకుంటారా? అన్నది సస్పెన్స్.
'ధి ఘోస్ట్' సినిమాతో సోలో సక్సెస్ అందుకోవాలని నాగ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆయనకు సోలో మాస్ కమర్శియల్ హిట్ పడి చాలా కాలమవుతోంది. మరి ఈ లెక్కలు బేరీజు వేసుకుని చిరంజీవినే స్నేహితుడు కోసం సైడ్ అవుతారా? లేక కింగ్ తప్పుకుంటారా? అన్నది చూడాలి. దీనిపై పూర్తి క్లారిటీ అనేది సెప్టెంబర్ నెలాఖరకు వచ్చే అవకాశం ఉంది.