చిరు క్లాసీ స్టెప్స్ కి స‌ల్మాన్ లేజీ స్టెప్స్ సింక్ ఎలా?

Update: 2022-08-01 03:57 GMT
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అత‌డు నటించిన క్రేజీ రీమేక్ 'గాడ్ ఫాదర్' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మూవీతో భారీ హిట్ కొట్టాలని మెగా కాంపౌండ్ అన్నివిధాలా స‌న్నాహ‌కాల్లో ఉంది.

ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవ‌ల విడుద‌లై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి సాంగ్ షూట్ నుండి ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవ‌న్నీ వైర‌ల్ గా మారాయి. ఈ సినిమాకి సంబంధించి మ‌రో కీల‌క అప్ డేట్ ని చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా అందించింది.

మెగాస్టార్ చిరంజీవి- బాలీవుడ్ సూప‌ర్ స్టార్ సల్మాన్‌ ఖాన్ లు క‌లిసి చేస్తున్న 'ది బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్' (మాస్‌ సాంగ్‌) షూటింగ్‌ పూర్తయిందని టీమ్ ప్ర‌క‌టించింది. ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను సంగీత సంచలనం థమన్ స్వరపరిచారు.

మెగాస్టార్ - సూప‌ర్ స్టార్ క‌ల‌యిక‌లో ఈ పాట సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. పైగా ప్ర‌భుదేవా మార్క్ కొరియోగ్ర‌ఫీ అద‌న‌పు అస్సెట్. అయితే చిరు క్లాసీ స్టెప్పుల‌కు స‌ల్మాన్ లేజీ స్టెప్పుల్ని ఎలా మ్యాచ్ చేసారు? అన్న‌దే  వేచి చూడాలి. ఆ ఇద్దరూ కలిసి కాలు క‌ద‌ప‌డ‌మే ఒక పెద్ద మ్యాజిక్ అనుకుంటే ఇది ఇద్ద‌రు అగ్ర హీరోల ఫ్యాన్స్ కి అద్భుత ట్రీట్ అవుతుంది.

ఈ చిత్రం లో నయనతార- సత్యదేవ్- సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ- సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

హనుమాన్ జంక్షన్ ఫేమ్ మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త‌దుప‌రి చిరు గాడ్ ఫాద‌ర్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి సారించనుండ‌గా.. స‌ల్మాన్ త‌న వ‌రుస ప్రాజెక్టుల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీ అవుతారు.
Tags:    

Similar News