31అక్టోబర్ .. హాలోవీన్ డే. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ఉత్సవాలను జరుపుకున్నారు. సెలబ్రిటీలు సైతం తమ ముఖాలకు రంగులు మార్చారు. కొందరు గుమ్మడికాయల ముసుగుల్ని తొడిగి భయపెట్టారు. రకరకాల వింతైన గెటప్పుల్లో ఫన్ క్రియేట్ చేశారు. భయంకరమైన దుస్తుల్ని ధరించి సరదా పార్టీల్లో నిమగ్నమయ్యారు. కొన్నిచోట్ల గుంపులుగా చేరి సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో తన సరదా హాలీవీన్ పార్టీ వీడియోను షేర్ చేయగా అది అభిమానులలో వైరల్ గా మారింది.
మెగాస్టార్ తన అభిమానులకు `హ్యాపీ హాలోవీన్` శుభాకాంక్షలు తెలిపారు. వీడియోలో చిరు హాలోవీన్ మేకోవర్ కోసం అధునాతన యాప్ ని ఉపయోగించారని అర్థమైంది. వీడియోను షేర్ చేస్తూ ``ఉత్కంఠభరితమైన రోజు`` అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతోంది. వీడియోలో చిరు ముఖాకృతి ఎంతో ఛమత్కారంగా కనిపిస్తోంది. సడెన్ గా ఆ కళ్లు ఎర్రబడడం కంటిన్యూగా విభిన్న మైన ఆహార్యంతో కనిపించడం చూస్తుంటే ఎంతో ఫన్ ఎలివేట్ అయ్యిందని చెప్పాలి. మెగాస్టార్ ఈ హాలోవీన్ కు భిన్నమైన ఆహార్యాన్ని ప్రయత్నించారు. బహుశా ఈ వీడియోని చిరు మనవలు మనవరాళ్లు వీక్షించి ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కితాబిచ్చేసి ఉంటారు.
కెరీర్ పరంగా చూస్తే...చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 4 ఫిబ్రవరి 2022న `ఆచార్య` విడుదల కానుంది. గాడ్ ఫాదర్-భోలా శంకర్ చిత్రాలతో పాటు బాబి దర్శకత్వంలో వాల్టేర్ శీనులోనూ చిరు నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. బోళా శంకర్ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తనతో గతంలో పని చేసిన ఓ సీనియర్ దర్శకుడికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కథనాలొస్తున్నాయి. మారుతి వినిపించిన లైన్ కి చిరు ఓకే చెప్పారని గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే.