హీరోయిజం అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తోంది. ఒకప్పుడు తమ హీరో సినిమా 100 రోజులు ఎన్ని ఎక్కువ థియేటర్లలో ఆడితే అంత క్రేజ్ అని హీరోల అభిమానులు భావించేవారు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ అనేక విధాలుగా మారి పోతూ వచ్చింది. విడుదలైన అతి తక్కువ రోజుల్లో ఎవరు ముందుగా 100 కోట్ల కలెక్షన్ టచ్ చేస్తున్నారు అనే విషయం మీద ఇప్పుడు హీరోల హీరోయిజం ఆధారపడి ఉంటుంది. అలాగే వివిధ రికార్డులను సెట్ చేసుకుని మా హీరో అందులో తోపు మా హీరో ఇందులో తోపు అని చెప్పుకోవడానికి అభిమానులు అర్రులు చాస్తున్నారు.
అలాంటి రికార్డులలో అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్ కూడా ఒకటి. అమెరికాలో మిలియన్ డాలర్లు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు అయితే మన హీరోలు ఈ ఫీట్ ను ఎప్పుడో సాధించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన వాల్తేరు వీరయ్య సినిమాతో 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ ఇచ్చారు. అయితే ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారు అనే విషయం మీద ఒకసారి లుక్కేద్దాం. ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కి ఇప్పటి వరకు నాలుగు రెండు మిలియన్ డాలర్ కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి.
అలాగే మహేష్ బాబుకి కూడా నాలుగు సినిమాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు మూడు సినిమాలు ఉండగా ఇప్పుడు చిరంజీవి కూడా మూడు సినిమాలతో ఎన్టీఆర్ సరసన చేరారు. ఇక మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ నలుగురికి రెండేసి చొప్పున 2 మిలియన్ డాలర్ వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి. ఇక విజయ్ దేవరకొండకి ఒక సినిమా ఉండగా నితిన్, వెంకటేష్ లకు కూడా చెరొక సినిమా ఉన్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమా రెండు మిలియన్ డాలర్ అమెరికాలో కలెక్ట్ చేయడంతో ఈ విషయంలో తన మెగా ఫ్యామిలీ హీరోలు అందరికంటే ముందున్నాను అనే నిరూపించుకున్నాడు. అయితే మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరూ నాలుగు సినిమాలతో టాప్ లో ఉండడంతో చిరంజీవి ఎన్టీఆర్ తో కలిసి రెండో స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.