మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 152వ సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ- మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నా యి. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ఎప్పుడు.. చిత్రీకరణ ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు అన్న వివరాలు మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా షెడ్యూల్స్ కి సంబంధించిన అప్ డేట్ అందింది.
తొలి షెడ్యూల్ ఈనెల 26 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. పాట చిత్రీకరణతో షూటింగ్ ప్రారంభిస్తారు. అలాగే హీరోయిన్ గా త్రిషను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా పాట చిత్రీకరణ తో మొదలు పెడితే బాగుంటుందని నిశ్చయించకున్నారట. ఇక రెండవ షెడ్యూల్ ని రాజమండ్రిలో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం కొరటాల టీమ్ రాజమండ్రి లో లోకేషన్స్ అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. రాజమండ్రిలో చిత్రీకరించే సన్నివేశాలు సినిమాకు కీలకమైనవి. అందుకే అక్కడ షూటింగ్ కి సంబంధించిన పనులన్ని పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారుట.
చిరంజీవి వ్యక్తిగత భద్రత కు సంబంధించిన పనులను అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడికి అప్పగించినట్లు సమాచారం. ఆయన ఆధ్వర్యంలోనే..ఆయనతో సహా సెక్యురిటీ కల్పించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటి? అన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. దేవాలయ భూముల స్కాం నేపథ్యంలో కథాంశం అని.. రాజకీయ నేపథ్యం ఉంటుందని ప్రచారమైంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? అన్నది తెలియాలంటే దర్శకహీరోలే స్వయంగా స్పందించాల్సి ఉంటుంది.