స్టార్‌ హీరో సినిమాకు 3డి హంగులు

Update: 2022-07-02 06:31 GMT
తమిళ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్‌ ఈ వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చినా కూడా విక్రమ్‌ సినిమాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవలే కొడుకు ధృవ్‌ తో కలిసి మహాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చియాన్ విక్రమ్‌ త్వరలో కోబ్రా సినిమా తో భారీ అంచనాల నడుమ బాక్సాఫీస్ దాడికి సిద్ధం అవుతున్నాడు.

కోబ్రా తో పాటు అత్యంత ప్రతిష్టాత్మక తమిళ చిత్రం అయిన పొన్నియన్‌ సెల్వన్ 1 సినిమా లో కూడా విక్రమ్‌ నటిస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విక్రమ్‌ తాజాగా మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు. విలక్షణ దర్శకుడు.. విభిన్న చిత్రాల దర్శకుడు అంటూ పేరు దక్కించుకున్న పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్‌ సినిమా రూపొందబోతుంది.

పా రంజిత్ సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుంది. ఆయన కథ మరియు కథనం లో విభిన్నమైన శైలి ఉంటుంది. కమర్షియల్‌ గా ఆ సినిమా లు సక్సెస్ కాకున్నా కూడా దర్శకుడిగా సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు విక్రమ్‌ తో ఈయన సినిమాను చేసేందుకు సిద్దం అవ్వడంతో అభిమానులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విక్రమ్ తో పా రంజిత్‌ చేయబోతున్న సినిమా కథ 18వ శతాబ్దం కు చెందినదిగా తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. కథ విషయంలో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. ఈ నెలలోనే షూటింగ్‌ జరిపేందుకు గాను ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. సినిమా ను అత్యాధునిక టెక్నాలజీతో చిత్రీకరించబోతున్నట్లుగా రంజిత్ పా టీమ్‌ చెబుతున్నారు.

ఈ సినిమా ను విక్రమ్‌ ఫ్యాన్స్ కోసం 3 డి లో కూడా తీసుకు రాబోతున్నారట. 3 డి టెక్నాలజీని తీసుకు వచ్చి దర్శకుడు పా రంజిత్ ఈ సినిమా తో ప్రేక్షకులకు ముఖ్యంగా విక్రమ్‌ అభిమానులను సర్‌ ప్రైజ్ చేస్తాడట.

పా రంజిత్ సినిమా లు సాధారణంగానే బాగుంటాయి.. అలాంటిది ఆయన 3డి హంగులు ఈ సినిమాకు అద్దితే ఖచ్చితంగా సూపర్‌ హిట్ అవ్వడం ఖాయం అంటూ తమిళ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News