డార్లింగ్ అనేసి కవరింగ్!

Update: 2018-12-03 07:56 GMT
ఆ మధ్య కవచం టీజర్ లాంచ్ లో కెమెరామెన్ ఛోటా కె నాయుడు స్టేజి మీద కాజల్ మాట్లాడుతూ ఉండగా దగ్గరికి వచ్చి ముద్దు పెట్టడం ఎంత రచ్చ అయ్యిందో చూసాంగా. బయట కనిపించలేదు కానీ ఈ మధ్యకాలంలో జనాల మీద విపరీత ప్రభావం చూపిస్తున్న సోషల్ మీడియాలో ఈ ఇష్యూ మీద భారీ ట్రాలింగ్ జరిగింది. ఎంత సీనియర్ అయినా అలా పబ్లిక్ గా స్టేజి మీద ఎలా ముద్దు పెడతారు అంటూ నెటిజెన్లు కాస్త ఘాటుగానే అడిగారు. ఇక కాజల్ ఫ్యాన్స్ గురించి చెప్పనక్కర్లేదు. కామెంట్స్ పోస్ట్స్ తో విరుచుకుపడినంత పని చేసారు.

ఆఖరికి ఛోటా దిగి వచ్చి అదంతా సరదాగా జరిగిందని కాజల్ తో ఎన్నో సినిమాలకు పని చేసిన చనువు స్నేహంతో అలా చేసానే తప్ప ఇంకే దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు కానీ అప్పటికే డ్యామేజ్ బాగా జరిగిపోయింది. తాజాగా అదే కవచం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చింది. నిన్న జరిగిన ఈ వేడుకలో ఛోటా ఆ గొడవ ప్రస్తావన తేకుండా కాజల్ నటన గురించి కమిట్మెంట్ గురించిన పొగడ్తలో కవర్ చేసేసాడు.

దుబాయ్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇసుక తుపానులో సైతం నలభై నిమిషాల పాటు కాజల్ ఇబ్బంది పడుతున్నా షాట్ బాగా రావడం కోసం కష్టపడిన సంఘటనను ప్రత్యేకంగా గుర్తు చేసాడు. అయినా కూడా డార్లింగ్ అంటూనే కాజల్ ని సంబోధించడం విశేషం. మొత్తానికి కవచం కంటెంట్ తో పాటు ఈ విషయాల పట్ల కూడా న్యూస్ లో నిలవడం విశేషం. డిసెంబర్ 7న రిలీజ్ కానున్న కవచం గురించి చోటా మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది
    

Tags:    

Similar News