నగ్నత్వ కథనంపై న్యాయ పోరాటంలో గెలిచిన గేల్‌

Update: 2018-12-03 16:55 GMT
వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌ మన్‌ క్రిస్‌ గేల్‌ పై కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆస్టేలియన్‌ మీడియా సంస్థ ఒక వార్త కథనంను ప్రచురించింది. ఆ వార్త ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు నివ్వెర పోయేలా చేసింది. ఆ వార్తతో గేల్‌ ను అంతా దోషిగా చూడటం మొదలు పెట్టారు. తనపై తప్పుడు కథనం రాసినందుకు గాను ఆ మీడియా సంస్థపై అప్పటి నుండి కూడా క్రిస్‌ గేల్‌ ఆస్టేలియన్‌ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాడు. తాజాగా గేల్‌ న్యాయ పోరాటంలో గెలవడంతో పాటు, రెండు లక్షల డాలర్లను జరిమానాగా కూడా పొందాడు.

ఇంతకు అప్పట్లో సదరు మీడియా సంస్థ ప్రచురించిన కథనం ఏంటీ అంటే.. ప్రపంచ కప్‌ కోసం ఆస్ట్రేలియా వచ్చిన వెస్టిండీస్‌ ఆటగాళ్ల కోసం స్థానిక మసాజ్‌ స్పెషలిస్ట్‌ లతో మసాజ్‌ ఏర్పాటు చేయించడం జరిగిందట. ఆ సమయంలో గేల్‌ కు ఒక యువతి మసాజ్‌ చేసేందుకు వచ్చిన సమయంలో ఆమె ముందు గేల్‌ పూర్తి నగ్నంగా నిలబడ్డాడట. దాంతో షాక్‌ అయిన ఆమె అక్కడ నుండి వెళ్లిందట. ఈ కథనం సదరు మీడియా సంస్థ ప్రచురించడం జరిగింది. అందులో వచ్చిన వార్తను ప్రపంచంలో ఉన్న మీడియా మొత్తం కవర్‌ చేసింది. దాంతో గేల్‌ తీవ్ర అసహనంతో సదరు మీడియాపై కేసు వేశాడు.

ఇన్నాళ్ల విచారణ తర్వాత గేల్‌ పై నిరాధారంగా కథనంను ప్రచురించి ఆయన పరువు తీశారు అంటూ మీడియా సంస్థను మందలించడంతో పాటు, రెండు లక్షల డాలర్లను జరిమానాగా కట్టాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసు తీర్పుపై గేల్‌ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అప్పట్లో గేల్‌ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆడవారు ఈయన వద్దకు వచ్చేందుకు కూడా ఇబ్బంది పడేవారట. మొత్తానికి గేల్ తనని తాను మంచోడు అని నిరూపించుకున్నాడు.

Tags:    

Similar News