ఆ బ్రేకప్ పై ప్రియాంక కన్ఫర్మేషన్!!

Update: 2016-09-26 06:09 GMT
హాలీవుడ్ లో వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా రీసెంట్ గా ముంబై వచ్చింది. గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చే కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ పెర్ఫామర్స్ తో కలిసి ప్రియాంక స్టేజ్ పంచుకుంది. వోకలిస్ట్ క్రిస్ మార్టిన్ ఈ ఫెస్టివల్ లో పాల్గొనే వాళ్ల లిస్ట్ చదివి వినిపించాడు. అందులో భాగంగా అమీర్ ఖాన్.. అమితాబ్ బచ్చన్.. ఇలా చదువుకుంటూ వచ్చాక.. కత్రినా పేరు వెనక కపూర్ ని చేర్చేశాడు.

కత్రినా కైఫ్ కపూర్ అంటూ.. కేట్ పేరును చదవడంతో.. ఒక్కసారిగా ప్రియాంక షాక్ తినేసింది. అయితే.. ఇంటర్నేషనల్ రేంజ్ కి డెవలప్ అయిపోయిన పీసీ.. ఒక్క సెకన్ లోనే తిరిగి కోరుకుని.. ఓహ్ అంటూ.. సిగ్నల్ ఇచ్చింది. దీనికి తానేమన్నా రాంగ్ ప్రనౌన్స్ చేశానా అన్నట్లుగా క్రిస్ మార్టిన్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టడం.. 'ఇట్స్ ఓవర్.. ఇట్స్ ఓవర్' అంటూ ప్రియాంక చిన్నగా చెప్పేయడం అన్నీ స్టేజ్ పైనే జరిగిపోయాయి. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోవడం గమనించాల్సిన విషయం. అయితే.. రణబీర్ కపూర్ తో కత్రినా ప్రేమాయణం బ్రేక్ అయిపోయిందనే సంగతిని ఆన్ స్టేజ్ పై ప్రియాంక చోప్రా క్లారిటీగా చెప్పేసినట్లు అయిపోయింది. కానీ ఆ ఇన్సిడెంట్ ని ప్రియాంక హ్యాండిల్ చేసిన తీరుకు మాత్రం బోలెడన్ని ప్రశంసలు వచ్చేస్తున్నాయి.

ఇకపోతే ఆ ఆర్టికల్ కూడా.. ఇట్స్ ఓవర్ ఇట్స్ ఓవర్.

Full View
Tags:    

Similar News