బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతితో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇర్ఫాన్ మరణించిన వార్త సినీ ప్రేక్షకులను కుదిపేసింది. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడిన ఆయన బుధవారం మధ్యాహ్నం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు ఇర్ఫాన్. ఆయన వయసు 54 సంవత్సరాలు. ఇర్ఫాన్ కు భార్య సుతాప.. ఇద్దరు కుమారులు బబిల్ - అయాన్ ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులను ఈ వార్త జీర్ణించుకోలేని పరిస్థితిని తెచ్చింది. కేవలం బాలీవుడ్ ప్రముఖులే కాకుండా అన్ని సినీ పరిశ్రమల ప్రముఖులు ఇర్ఫాన్ మృతిపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు. తమ సహచర నటుడు ఇర్ఫాన్ ఇకలేరన్న వార్త తెలుసుకొని చిరంజీవి - కమల్ హాసన్ - మహేష్ బాబు - ప్రకాశ్ రాజ్ - విక్టరీ వెంకటేష్ - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ తదితరులు సోషల్ మీడియాలో స్పందించారు.
'ఇర్ఫాన్ ఖాన్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారనే వార్త నన్ను ఒక్కసారిగా కుదిపేసింది. ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందారనే ఘోరమైన వార్త విని చాలా బాధపడ్డాను. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గొప్ప నటుడు ఆయన. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఆయన మంచి ప్రవర్తన మన హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది. ప్రియమైన ఇర్ఫాన్ మేం మిమ్మల్ని కోల్పోతున్నాం.. మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోలేం' అని చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. 'బ్రిలియంట్ యాక్టర్ ని ఇంత త్వరగా కోల్పోతాం అని ఊహించలేదని.. ఆయన అకాల మరణ వార్తతో చాలా బాధపడ్డా.. నిజంగా మనం అతన్ని మిస్ అయ్యాం.. ఇర్ఫాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నా' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు. 'ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారనే వార్త అత్యంత విషాదకరం. ఇంత చిన్న వయసులోనే తిరిగి రానిలోకాలకు వెళ్లడం భావ్యమా.. ప్రపంచ సినిమాకు నీవు చేసిన విలువైన సేవలకు జీవితాంతం రుణపడి ఉంటాం. నీవు లేని లోటు పూడ్చలేనిది. నీవు ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని ప్రకాశ్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
'ఇంత త్వరగా నీవు ఈ లోకాన్ని వీడుతావని కలలో కూడా ఊహించలేదు. నిన్ను తెరమీద చూసిన ప్రతీసారి వావ్ అనిపించావు. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభావంతుడైన నటుడివి నీవు. నీ ప్రయాణం, కీర్తి మరింత కాలం కొనసాగాలని ఆశించాను. కళామతల్లికి ఇంకా ఎంతో సేవ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా అర్ధాంతరంగా వదలివెళ్లడం బాధగా ఉంది. ఈ విషాద సమయంలో నీ కుటుంబానికి మానసిక స్థైర్యం ఇవ్వాలని కోరుకొంటున్నాను' అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. 'ప్రపంచ సినిమాకు తీరని, పూడ్చలేని లోటు. ఆయనతో కలిసి నటించాలనే కోరిక తీరలేదు. కానీ ఆయన నటనను చూసి స్ఫూర్తిని పొందాను. పుష్కలమైన ప్రతిభ ఉన్న నటులు ఇర్ఫాన్ అని చెప్పగలను. మీ సేవలను మీ సినిమాలను.. నటనను చిరకాలం మా హృదయంలో దాచుకొంటాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని వెంకటేష్ ట్వీట్ చేశారు.
'సినిమా ప్రపంచం కిరీటాన్ని కోల్పోయింది. అత్యంత అసాధారణ నటుల్లో ఆయనొకరు. సినీ పరిశ్రమ కచ్చితంగా ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి ఇర్ఫాన్ ఖాన్ గారు' అని రామ్ చరణ్ పేర్కొన్నారు. 'ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది. మీరు స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్షణం నేను ఇష్టపడేవాడిని. ఆయన జెంటిల్ మ్యాన్. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు.