‘సంఘమిత్ర’కు ‘జనతా గ్యారేజ్’ కనెక్షన్

Update: 2017-05-20 09:44 GMT
‘బాహుబలి’కి దీటుగా ఓ జానపద చిత్రం చేయడానికి రెండేళ్లుగా శ్రమిస్తున్నాడు తమిళ దర్శకుడు సుందర్. ఆ సినిమానే ‘సంఘమిత్ర’. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ ఎప్పుడో 2015లో మొదలైంది. ఎట్టకేలకు ఆ పనంతా పూర్తయి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం కేన్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా ‘సంఘమిత్ర’ను లాంచ్ చేయబోతున్నారు. ఇంకో నెల రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది. ఈ చిత్రానికి జయం రవి.. ఆర్య లాంటి మీడియం రేంజి హీరోల్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు సుందర్. ఐతే నటీనటుల సంగతలా ఉంచితే.. టెక్నీషియన్ల విషయంలో మాత్రం అతను రాజీ పడలేదు.

స్వర మాంత్రికుడు.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నాడు. ఇది కచ్చితంగా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. రెహమాన్ రాకతో ఈ సినిమా స్థాయే మారిపోతుందనడంలో సందేహం లేదు. అలాగే ‘బాహుబలి’కి పని చేసిన ఇండియాస్ నంబర్ వన్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ సైతం ఈ చిత్రానికి పని చేయనున్నాడు. ‘బాహుబలి’ పని ముగియగానే ఆయన ‘సంఘమిత్ర’ మీదికి వెళ్లిపోయాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా కూడా పెద్ద స్థాయి వ్యక్తినే తీసుకున్నారు. అతను మరెవరో కాదు.. ‘జనతా గ్యారేజ్’కు ఛాయాగ్రహణం అందించిన తిరు. ఈ సినిమా కంటే ముందు తిరు.. ‘24’.. ‘క్రిష్-3’.. ‘కాంజివరం’.. ‘లాంటి సినిమాలకు పని చేశారు. వీఎఫెక్స్ విషయంలో కూడా ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటున్నాడు సుందర్. మరి వీళ్లందరూ కలిసి ‘సంఘమిత్ర’ను ఎలా తీర్చిదిద్దుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News