క్లారిటీ ఇచ్చిన న్యాచురల్ స్టార్!

Update: 2019-06-03 10:27 GMT
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గ్యాంగ్ లీడర్' కాగా మరొకటి మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో రూపొందుతున్న 'V'.  ఈ రెండు సినిమాల తర్వాత నాని మరో సినిమాకు పచ్చజెండా ఊపాడని ఆ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నాని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీకాంత్ అడ్డాలకు ఎడ్వాన్స్ ఉందని.. ఇప్పుడు ఆ కమిట్మెంట్ నే 'కూచిపూడి వారి వీధి' టైటిల్ తో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అయ్యారని అన్నారు.  నాని ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.  నాని ఫ్యాన్ ఒకరు ఈ వార్తకు సంబంధించిన ఇమేజ్ ఒకటి షేర్ చేస్తే నాని దానికి స్పందిస్తూ "ఫాల్స్ న్యూస్ మై బాయ్స్" అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో శ్రీకాంత్ అడ్డాలతో సినిమా లేదని తేలిపోయింది.  నాని-శ్రీకాంత్ అడ్డాల సినిమా వార్త ఫేక్ న్యూస్ అని అందరికీ క్లారిటీ వచ్చింది.

శ్రీకాంత్ అడ్డాల లాస్ట్ సినిమా 'బ్రహ్మోత్సవం' మహేష్ బాబు కెరీర్లో డిజాస్టర్ గా నిలిచింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి సినిమాను ఇచ్చాడనే నమ్మకంతో శ్రీకాంత్ కు మహేష్ అవకాశం ఇస్తే అది నిలుపుకోలేకపోయాడు. అప్పటి నుంచి శ్రీకాంత్ తన నెక్స్ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరి ఎప్పటికి తన ప్రయత్నాలు ఫలిస్తాయో వేచి చూడాలి.  ఏదేమైనా శ్రీకాంత్ తో సినిమా లేదనగానే నాని ఫ్యాన్స్ మాత్రం ఊపిరి పీల్చుకున్నారు.  

Tags:    

Similar News